Advertisement
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఎప్పటినుంచో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కి ఈ సినిమా తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ని తీసుకువచ్చింది. అప్పటివరకు రవితేజ విషయంలో ఆలోచించిన దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రం తర్వాత స్పీడ్ గా ముందుకు వెళ్లారు. చక్రి సంగీతం, రక్షిత అందచందాలు, ప్రకాష్ రాజ్ ఎమోషన్ అన్నీ కలగలిపి సినిమాని సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ ఇది.
Advertisement
Read also: కృష్ణ, విజయనిర్మల పెళ్లిపై ఇందిరా దేవి గారు ఏమన్నారు..?
Advertisement
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని ముందు కన్నడంలో డైరెక్ట్ చేశారు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఈ సినిమా కథ వినిపించగా రాజ్ కుమార్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. ఈ చిత్రాన్ని ముందు పూరి తెలుగులో చేయాలనుకున్నాడు. కానీ పునీత్ రాజ్ కుమార్ ను లాంచ్ చేయడానికి ఎన్నో కథలు వింటున్నారు రాజకుమార్. కానీ మంచి కథలు దొరకపోవడంతో పూరి చెప్పిన కథ బాగా నచ్చి దాదాపు రెండు గంటల పాటు కథ విని సినిమాని రాజకుమార్ ఓకే చేశారు. అప్పు పేరుతో సినిమాని తెరకెక్కించగా ఆ సినిమా పేరే పునీత్ రాజ్ కుమార్ కు నిక్ నేమ్ గా మారిపోయింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ కి మంచి హిట్ ఇవ్వడంతో అదే జోష్ లో వెంటనే ఈ సినిమాని తెలుగులో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించారు. ఇక ఈ స్టోరీని మహేష్ బాబుకి చెబితే వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారట.
కానీ పూరి జగన్నాథ్ అప్పటికే పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేసి.. ఆ తర్వాత ఇడియట్ సినిమా స్టోరీ ని పవన్ కళ్యాణ్ కు వినిపించగా. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని వద్దని చెప్పారట. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో ఆడవారిని ఏడిపించే సన్నివేశాలు ఉండడంతో.. అలాంటి సినిమాలు చేయడం వల్ల సమాజంలోకి వేరే మెసేజ్ వెళుతుందని ఇడియట్ సినిమా చేయకుండా పవన్ కళ్యాణ్ తప్పుకున్నారట. ఇలా ఒక ఇడియట్ మాత్రమే కాకుండా పోకిరి.. ఇంకా చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా చాలావరకు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకున్నారు పవన్ కళ్యాణ్.
Read also: ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన దమ్మున్న హీరోలు వీళ్లే..!!