Advertisement
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీని స్థాపించి.. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తూ రాష్ట్ర సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైయస్ షర్మిల వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువమందికి తెలియకపోవచ్చు. షర్మిల భర్త అనిల్ కుమార్ దైవ సేవకుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు షర్మిల ఆమెకు ఎంత మంది సంతానం అనే విషయాన్ని ఎప్పుడూ పంచుకోలేదు.
Advertisement
షర్మిల తాజాగా తన కుమారుడితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. షర్మిల – అనిల్ కుమార్ కి ఇద్దరు సంతానం. వీరిలో కుమార్తె పేరు అంజలి, కొడుకు రాజారెడ్డి ఉన్నారు. తన కుమారుడికి తాత పేరు పెట్టుకున్నారు వైఎస్ షర్మిల. ఇక నేడు షర్మిల ముద్దుల కొడుకు రాజా పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ ఆల్బమ్ నుండి ఓ చిత్రాన్ని షేర్ చేసి.. శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. ” పుట్టినరోజు శుభాకాంక్షలు రాజా, ఎల్లప్పుడూ సంతోషం! నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను!!” అంటూ క్యాప్షన్ ఇచ్చి కొడుకుని హగ్ చేసుకుని ఉన్న ఫోటోని షేర్ చేశారు షర్మిల. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక షర్మిల పోస్టుతో ఆమె కొడుకు ఎవరో అందరికీ తెలిసిపోయింది.
Advertisement
అయితే ఇన్నాళ్లు తన ఫ్యామిలీని పరిచయం చేయని షర్మిల ఇప్పుడు వారసుని ఫోటో ఎందుకు అభిమానులతో పంచుకుంది? అతడిని కూడా రాజకీయరంగ ప్రవేశం చేయిస్తుందా? లేక అతడికి ఇష్టమైన కెరీర్ ను ఎంచుకునేలా చేస్తుందా? అనే ఆలోచనలో పడ్డారు నేటిజన్లు. ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువు పూర్తి చేశారు. ఇటీవల షర్మిల తల్లి విజయమ్మతో కలిసి డల్లాస్ లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read also: ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన దమ్మున్న హీరోలు వీళ్లే..!!
https://sumantv.com/telugu-news/andhra-pradesh/ys-sharmila-wishes-son-raja-reddy-on-his-birthday-photo-viral-on-social-media-269617.html