Advertisement
దేవాలయానికి వెళ్ళని భక్తులు ఉండరు. ఇదే సందర్భంలో భక్తులు తప్పక గుడిలో కొబ్బరికాయ లను సైతం కొడతారు. అయితే ఈ కొబ్బరికాయ మంచిగా ఉంటే సంతోషం కానీ కొన్నిసార్లు పైకి మంచిగా ఉన్న లోపల కుళ్ళిపోతుంది. అప్పుడు ఏం అవుతోందని భయం, ఆందోళన. దీనిపై పెద్దలు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం….
Advertisement
కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్ళను పరమేశ్వరుడి కళ్ళుగా త్రినేత్ర స్వరూపంగా భావిస్తారు. చాలామంది టెంకాయ కొట్టగానే అది కుళ్ళి పోయి గనక వస్తే దాంతో తమకు ఆ శుభం జరుగుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. అపనమ్మకమే.
Advertisement
ఒకవేళ టెంకాయ కుళ్ళి పోయి గనక వస్తే మళ్లీ స్నానం చేసి వచ్చి మళ్లీ ఇంకో కొబ్బరికాయని కొట్టాలి. టెంకాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే కోరిన కోరికలు తీరుతాయట. నూతన వధూవరులకు పువ్వు వస్తే వారికి సంతానం త్వరగా కలుగుతుందని నమ్ముతారు. ఇక కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఆ భక్తుల ఇంట్లో వారికి త్వరగా సంతానం కలుగుతుందని చెబుతారు. కొబ్బరికాయ కుళ్ళి పోయిన బాధ పడాల్సిన అవసరం లేదు. పవిత్రమైన భక్తితో స్వామి లేదా అమ్మకు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది.
also read;