Advertisement
Rishab Pant News: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది.
Advertisement
అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రిషబ్ పంత్. కారు రోడ్డు డివైడర్ అని ఢీ కొట్టిన ఆరు నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందు ఆటుగా వెళుతున్న వాహనాదారులతో పాటు స్థానికులు కారు ప్రమాదాన్ని గుర్తించారు.
Advertisement
ఈ సమయంలో వేగంగా కారు వద్దకు వచ్చిన జనాలు కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్ ని రక్షించడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకొని పారిపోయారట. దీంతో ఏం చేయాలో తెలియని రిషబ్ అతి కష్టం మీద బయటకు వచ్చి ఆంబులెన్స్ కి ఫోన్ చేశారని తెలుస్తోంది. నిస్సహాయ స్థితిలో రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతంలో రిషబ్ పంత్ పడిపోయాడు. కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారు మంటల్లో కాలిపోతున్న చాలామంది వాహనదారులు పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోవడం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అయితే అటుగా వెళుతున్న మరికొందరు ప్రయాణికులు, ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అందుతుంది.
Read also: SAMANTHA : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?