Advertisement
భారతదేశంలో చాలామంది ఇప్పటికి జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. ఏదైనా శుభకార్యం చేయాలంటే దానికి రోజు, సమయం, తేదీ, ముహూర్తం లాంటిది చూసుకొని చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని పనులు చేయాలంటే కూడా కొన్ని ప్రత్యేక దినాల్లో చేయరు. ముఖ్యంగా డబ్బు విషయంలో, వాస్తు విషయంలో చెప్పినట్లు నమ్ముతారు. ఇది ఇలా ఉండగా, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వాస్తు శాస్త్రంలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనసు ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే ఇల్లు శుభ్రంగా ఉంటేనే, అక్కడ లక్ష్మీ నివాసం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈశాన్య దిశలో శుభ్రత లోపిస్తే, మీకు అస్సలు మంచిది కాదట. చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి, దాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా చూస్తారని అంటారు. ఇక డబ్బు, నగలు ఉంటే అల్మారకు దగ్గరగా చీపురును అస్సలు ఉంచకూడదట. అదే మీ ఇంట్లో డబ్బు నిలవడంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట.
Advertisement
వీటితో పాటు ఇంట్లో ఉన్న పెద్ద వారికి గౌరవం ఇస్తూ ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి చిన్న దానికి ఆవేశపడి అరవడం, అనవసరంగా ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం, అతిగా నిద్రపోవడం కూడా ఇంట్లో నెగెటివిటీని పెరగడానికి ప్రధాన కారణాలు. ఇవి కూడా మీ ఆదాయంపై తీర ప్రభావం చూపిస్తాయి. ఇక ఇంట్లో ఆగ్నేయ దిశలో డబ్బు అసలు ఉంచకూడదని అంటున్నారు. చాలామంది కబోర్డ్ లో తాళం చెవిని తీసుకెళ్లి పెడుతుంటారు. అలా చేయడం వల్ల కూడా ధన నష్టం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తూ, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూనే, మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు, అప్పుడే మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగుపెడుతుంది.
Read also: ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా 7 దేవి శ్రీ ప్రసాద్ పాటలు!