Advertisement
ఆమధ్య ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో పెద్ద గొడవే జరిగింది. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, అరెస్టులతో కొద్ది రోజులు నానా రచ్చ కొనసాగింది. ఏం చేసినా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టేసింది. అయితే.. ఈ వివాదం సద్దుమణిగింది అనుకున్న టైమ్ లో బాలయ్య మరోసారి గుర్తు చేసినట్టైంది.
Advertisement
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ డైరెక్షన్ వస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బాలయ్య మార్క్ ఊర మాస్ డైలాగులు, యాక్షన్ తో నిండిపోయింది ఈ ట్రైలర్. అయితే.. ఓ రెండు డైలాగులు మాత్రం జగన్ ను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
Advertisement
– సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టుకోకూడదని నేను ఒక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత.
– నాది ఫ్యాక్షన్ కాదు సీమపై ఎఫెక్షన్.
– పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్
– పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ కు అయినా వెళ్లి లేచి నిలబడు అక్కడ ఓ స్లోగన్ వినపడుతుంది
– అపాయింట్ మెంట్ లేకుండా వస్తే అకేషన్, లొకేషన్ చూడను ఒంటిచేత్తో ఊచకోత
– సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.
– పదవి చూసుకుని నీకు పొగరేమో, కానీ నాకు బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు ఎక్కువ
లాస్ట్ లో ఉన్న ఈ రెండు డైలాగులే టీడీపీ శ్రేణులకు, బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జరిగిన రగడను గుర్తు చేస్తూ.. సంతకాలు పెడితే బోర్డు మీర పేరు మారుతుందేమో.. కానీ, చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ పేరు మారదు.. మార్చలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే పదవి ఉంది కదా అని పొగరు ఎందుకు అంటూ టార్గెట్ చేస్తున్నారు.