Advertisement
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అంతేకాదు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. అయితే ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్త కాదు. మన పూర్వీకులు సైతం ఎదుర్కొన్న అంటురోగాలలో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్నాయన్నది వాస్తవం. 19వ శతాబ్దంలో కూడా భారతదేశంలో స్మాల్ పాక్స్ లేదా మసూచి అని పిలిచే ఈ అంటూ వ్యాధి అప్పుడు కూడా దేశాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఈ అంటూ వ్యాధిని సైన్స్ పూర్తిగా తుడిచిపెట్టగలిగింది. మసూచిని మొట్టమొదటిసారిగా 1520లో గుర్తించారు. వరియోల మైనర్ అనే వైరస్ ద్వారా వ్యాప్తించే ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. ఇది ఒక భయంకరమైన చర్మవ్యాధి. శరీరంపై నీటితో నిండిన పొక్కులు ఏర్పడతాయి. పదిమందిలో ముగ్గురు ఈ అంటురోగం బారిన పడి చనిపోయారు.
Advertisement
Read also: ఇదేంటి బాలయ్య గారు అక్కడేమో అలా ఇక్కడేమో ఇలా ? బాలయ్య మాట మార్చేశారు ?
Advertisement
ఆ కాలంలో ఈ వ్యాధి తుమ్ము, దగ్గులతోపాటు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా.. లేదా శరీరంపై ఏర్పడే పుండ్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందింది. ప్లేగు వ్యాధి లాగానే మసూచి కూడా కొన్ని కోట్ల మంది ప్రాణాలను హరించింది. 20వ శతాబ్దంలోనే మసూచి బారిన పడి 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ సమయంలో గీసిన ఓ పెయింటింగ్ గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. ఈ పెయింటింగ్ లో ఉన్న అందమైన ముగ్గురు రాజవంశ స్త్రీలలో కుడివైపున ఉన్న స్త్రీ తన చీరను కొంచెం పైకెత్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా ఈ పెయింటింగ్ గీయడానికి గల కారణం ఏమిటంటే.. మసూచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో మైసూర్ ప్రాంతంలో కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందింది. ఆ సమయంలో మైసూరులో బ్రిటిష్ ఇండియా తరఫున పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మార్క్ విల్కేస్ మైసూర్ రాజ్య ప్రజలను మసూచి నివారణకు టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరారు.
కానీ ఆ సమయంలో బ్రిటిష్ టీకాలు ప్రాణానికి ముప్పు అనే వదంతులు దేశమంతా చెక్కర్లు కొట్టాయి. దీంతో చాలామంది ఆ టీకాలు వేయించుకోవడానికి తిరస్కరించారు. ఇదే సందర్భంలో మైసూర్ రాజ్య యువరాజుకు ఈ ఫోటోలో కుడివైపున ఉన్న దేవజమనితో నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఆ యువరాణి పెళ్ళికి ముందే బ్రిటిష్ టీకాలను వేయించుకుంది. యువరాజుకు కాబోయే భార్యనే టీకా వేయించుకుంది.. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని ఈ పెయింటింగ్ ద్వారా కోరారు. అందుకే ఈ పెయింటింగ్ లో టీకా వేయించుకున్న స్త్రీ ఆమెనే అని తెలిపేందుకు సింబాలిక్ గా చూపించారు.
Read also: స్త్రీలు బహిష్టు సమయంలో పూజలు ఎందుకు చెయ్యకూడదంటే ?