Advertisement
2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒకేసారి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది. ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఎంత త్వరగా ఫేమస్ అయ్యారో అంతే త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఉదయ్ కిరణ్ ని తొక్కేసేందుకు కుట్రలు కూడా జరిగాయి అన్న ప్రచారం అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది. ఉదయ్ కిరణ్ తనకు ఎంత స్టార్డం వచ్చినా ఎప్పుడు ఒదిగి ఉండేవాడు.
Advertisement
Advertisement
అయినా విధి ఆడిన వింత నాటకంలో ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయినా ఆయనకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే ఉదయ్ కిరణ్ కి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అది పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. అందుకు గల కారణాలను అనేకం చెబుతుంటారు. అయితే ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవ్ బ్రేకప్ సంగతి గురించి తెలిసినప్పటికీ చిరంజీవి తన కూతురిని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. సుస్మిత తో ఎంగేజ్మెంట్ కి ముందు ఉదయ్ కిరణ్ ఓ మహిళా జర్నలిస్టుతో ప్రేమలో పడ్డారు. మనసంతా నువ్వే చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాక తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టుతో ఉదయ్ కిరణ్ కి పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కలవడంతో అది ప్రేమగా మారింది. అయితే చిన్న చిన్న మనస్పర్ధల నేపథ్యంలో ఆ మహిళ జర్నలిస్టు ఉదయ్ కిరణ్ కి బ్రేకప్ చెప్పేసింది. చివరికి ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్లి బ్రతిమాలడంతో పాటు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారట. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఉదయ్ కిరణ్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి సైతం చెప్పి ఎంతో బాధపడేవారట. అప్పుడు చిరంజీవి ముందు కెరీర్ మీద దృష్టి పెట్టాలని సూచించారట. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ పై చిరంజీవికి ఇంప్రెషన్ కలగడంతో తన కూతురితో పెళ్లి జరిపించాలని అనుకున్నారట. కానీ ఏవో తేడాలు రావడంతో పెళ్లి పీటల వరకు వచ్చి క్యాన్సల్ అయింది.
Read also: “అక్కినేని ఫ్యామిలీ” పేర్లకు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి