Advertisement
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. అయితే, తరచూ బ్యాట్స్ మెన్ పిచ్ పై తమ బ్యాట్ తో ట్యాప్ చేయడం చూసే ఉంటారు. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారన్న విషయం చాలామందికి తెలియదు. అయితే దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
క్రికెట్ లో పిచ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి మ్యాచ్ కు ముందు పిచ్ ఎలా ఉందన్న దానిపై ప్రత్యేకంగా రిపోర్ట్ ఇస్తారు. పిచ్ కు తగినట్లే ఆయా టీమ్స్ తమ తుది జట్లను ప్రకటిస్తాయి. అలాంటి పిచ్ పై బ్యాట్స్ మెన్ బ్యాట్ తో కొట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. పిచ్ ఎలా ఉందో తెలుసుకోవడం, పిచ్ పై ఉన్న పగుళ్లను గుర్తించి వాటిని మూసివేసే ప్రయత్నం చేయడం, కొన్ని సార్లు కేవలం తమ ఆందోళనను తగ్గించుకోవడానికి కూడా బ్యాటర్లు ఇలా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు క్రికెట్ పిచ్ ప్రమాదకరంగా కనిపిస్తుంది. వాటిపై ఉండే పగుళ్ల వల్ల ఒక్కోసారి బంతి ఊహించని విధంగా బౌన్స్ అవుతుంది.
Advertisement
కొన్నిసార్లు అనూహ్యంగా పైకి దూసుకురావడం, మరికొన్నిసార్లు ఊహించిన దానికంటే తక్కువ ఎత్తులో రావటం జరుగుతుంది. ఇది బ్యాట్స్ మెన్ ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడే క్రిజులోకి వచ్చిన బ్యాటర్ నేరుగా క్రీజ్ లోకి రాగానే పిచ్ పై అక్కడక్కడ ట్యాప్ చేస్తుంటాడు. అలాంటి పగుళ్లు ఏమైనా కనిపిస్తే వాటిని మరీ ప్రమాదకరంగా మారకుండా చేసే ప్రయత్నమే ఇది. ఒక్కోసారి క్రీజ్ లో సెటిల్ అయిన బ్యాట్స్ మెన్ కూడా ఇలా అనహ్యమైన బౌన్స్ వచ్చినప్పుడు ఈ పని చేస్తుంటారు. బౌలర్లను వెయిట్ చేయించడం క్రికెట్ ఒక మైండ్ గేమ్ కూడా. బ్యాట్స్మెన్ లేదా బౌలర్ పై మానసికంగా కూడా పై చేయి సాధిస్తేనే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రత్యర్థిపై చేయి సాధిస్తున్న సందర్భాల్లో వాళ్లను మానసికంగా దెబ్బతీయడానికి ప్లేయర్స్ మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంటారు. అందులో ఈ పిచ్ టాపింగ్ కూడా ఒకటి. బ్యాట్స్ మెన్ ఒత్తిడిలో ఉన్న సమయంలో బౌలర్ ను కాసేపు వేచి చూసేలా చేయడానికి కూడా ఇలా పిచ్ పై ట్యాప్ చేస్తూ కాస్త రిలాక్స్ అవుతారు.
READ ALSO : రోజాకు మెగాస్టార్ కౌంటర్ పేలిపోయిందిగా… నో ఆన్సర్…!