Advertisement
waltair veerayya Review Telugu: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.
Advertisement
కథ మరియు వివరణ
విశాఖపట్నం వాల్తేరులోని జాలరి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య (మెగాస్టార్ చిరంజీవి) ఆ పేట మొత్తానికి బాస్ లాంటి వాడు. తనకు ఎవరూ లేకపోవడంతో తన పేట వాళ్లే తనవాళ్లుగా బతుకుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు ఒక డ్రగ్స్ డాన్ (బాబి సింహ) చేతిలో తోటి పోలీసులు అందరూ ఊచకోతకు గురవడంతో ఆ డాన్ మీద పగ తీర్చుకోవాలని దాని కోసం ఎంత డబ్బు అయినా ఇస్తానంటూ సీతాపతి (రాజేంద్రప్రసాద్) అనే వ్యక్తి వస్తాడు. ఆ డ్రగ్స్ డాన్ మలేషియాలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వాల్తేరు ‘వీరయ్య అండ్ కో’ నీ తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన వీరయ్య అక్కడి హోటల్లో పనిచేసే అదితి (శృతిహాసన్) తో ప్రేమలో పడతాడు. డ్రగ్స్ డాన్ ను పట్టుకోవడం కాదు. తనకు అసలు అతను టార్గెట్ కాదని అతని అన్న మైకేల్ (ప్రకాష్ రాజ్) టార్గెట్ అంటూ సీతాపతికి షాక్ ఇస్తాడు. అసలు విశాఖపట్నం వాల్తేరులోని జాలరి పేటలో నివసించే వీరయ్యకు, మలేషియాలో డ్రగ్స్ బిజినెస్ చేసే మైకేల్ ఎందుకు టార్గెట్ అవుతాడు? అసలు వాల్తేరు వీరయ్య అనాధనా? అతనికి ఎవరూ లేరా? అదితి వీరయ్యకు ఇచ్చిన షాక్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో తీసిన బెస్ట్ కమర్షియల్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ మెగాస్టార్ కి వీరాభిమానిగా ఈ సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు బాబి అతను కచ్చితంగా పాతకాలపు మెగాస్టార్ అభిమానులకు హామీ ఇచ్చాడు మరియు వాల్తేరు వీరయ్యతో కొంతవరకు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేశాడనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య అనేది పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి యొక్క మాస్ యుఫోరియాని తెరపై జరుపుకోవడానికి రూపొందించబడిన చిత్రం. అయితే సినిమాలో అతని పాత సినిమాల కాపీ క్యాట్ కాకుండా నటుడి గొప్పతనాన్ని ఎలివేట్ చేసే కొన్ని ఆసక్తికరమైన కథ మరియు సన్నివేశాలు ఉండుంటే ఇంకా బాగుండేది.
ప్లస్ పాయింట్లు:
డ్యాన్స్ కొరియోగ్రఫీ
రవితేజ మరియు చిరంజీవి పాల్గొన్న కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్లు:
సంగీతం
కథ
స్క్రీన్ ప్లే
సినిమా రేటింగ్: 2.5/5
Read Also : జనసేన సభలో హైపర్ ఆది పంచ్ లు!