Advertisement
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తుంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకునేలా సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను తిరగరాసేలా సినిమాలు తీయడం ఒక రాజమౌళికే చెల్లింది. రాజమౌళి దర్శకుడిగా మారిన 2001 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది. అపజయం అంటూ ఎరుగక దూసుకుపోతున్నారు.
Advertisement
Read also: అతను లారీ డ్రైవర్! ఆమె చదువుల తల్లి! సినిమాని మించిన పెద్దిరాజు ప్రేమగాధ!
రాజమౌళి చేసిన సినిమాలన్నింటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే హీరోలతో సంబంధం లేకుండా పోస్టర్ పై రాజమౌళి పేరు కనబడితే చాలు థియేటర్లకి పరుగులు తీసే ప్రేక్షకులు ఉన్నారు. ఈయన తీసిన సినిమాలలో ఏ సినిమా ఇష్టం లేదు అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఈయన సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. కానీ ఆయన సతీమణికి మాత్రం రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక సినిమా అస్సలు నచ్చలేదట. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి కూడా ఆయన సినిమాలలో భాగం అవుతూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య రాజమౌళి సతీమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో యమదొంగ సినిమా ఆమెకు అసలు నచ్చలేదని చెప్పుకొచ్చారు.
Advertisement
కారణాలు చెప్పలేను కానీ యమదొంగ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ తనకు నచ్చలేదని చెప్పింది రమ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, ఎన్టీఆర్ వళ్లే ఆ సినిమా హిట్ అయిందని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతుంది. ఇటీవల ఈ చిత్రంలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీనితో పాటుగా క్రిటిక్ ఛాయిస్ అవార్డులో భాగంగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ (నాటు నాటు) అవార్డులను కూడా గెలుచుకుంది.
Read also: మంత్రి ఆర్కే రోజా తండ్రి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?