Advertisement
నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రాన్ని 100కు పైగా దేశాలలో దాదాపు 7 వేల స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాలతో ఈ సినిమా ( జనవరి 25) న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
Advertisement
Read also: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత 10TH క్లాస్ మార్క్స్ లిస్ట్.. వామ్మో ఇన్ని తప్పులా..?
కథ మరియు వివరణ:
సాధారణంగా డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు పఠాన్ మూవీ కూడా అదే పంధాలో రూపొందింది. ఆర్టికల్ 370 (జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా) ని భారతదేశం రద్దు చేయడం, ఈ కారణంగా భారతదేశానికి హాని తలపెట్టేందుకు ఓ పాకిస్తానీ జనరల్ డేంజరస్ సింథటిక్ వైరస్ ను రిలీజ్ చేసేందుకు చేసే ప్రయత్నాన్ని ఇండియాకి చెందిన ఒక అండర్ కవర్ కాప్, మాజీ నేరస్తుడు కలిసి నిర్వహించే మిషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మిషన్ లో ఎవరు విజయం సాధించారు, ఎటువంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
పఠాన్ పాత్రలో భారత సైనికుడిగా షారుక్ ఖాన్ అద్భుతంగా నటించారు. షారుక్ ఖాన్ ఒంటి చేత్తో సినిమాని పైకి లేపాడు. ప్రతి సన్నివేశంలోనూ షారుక్ ఖాన్ అదరగొట్టాడు. ఇక దీపికా పదుకొనే తన నటనతో పాటు గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. జాన్ అబ్రహం నెగిటివ్ రోల్ లో అదరగొట్టేశాడు. కల్నల్ లూత్రాగా అశుతోష్ రానా, డింపుల్ కపాడియా పాత్రలు సైతం అందరిని మెప్పించాయి. ఇక విశాల్ శేఖర్ సంగీతం కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మూవీలో పఠాన్ కోసం టైగర్ కూడా వస్తారు. సల్మాన్ ఖాన్, షారుఖాన్ కలిసి చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీ లవర్స్ కి కిక్కిచ్చేలా ప్లాన్ చేశారు దర్శకుడు.
ప్లస్ పాయింట్స్:
షారుక్ ఖాన్ నటన
సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
రేటింగ్ : 3/5
Read also: HEALTH TIPS: ఉదయాన్నే లేవగానే మీలో ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?