Advertisement
భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూడుముళ్ల బంధం ముచ్చటైన కాపురానికి నాంది పలుకుతుందని పెళ్లికి అంతా చాలా విలువ ఇస్తారు. ఇక మహిళలు అయితే పెళ్లయిన తర్వాత కన్నవారిని వదిలి భర్తె సర్వస్వం అంటూ ఏడడుగుల బంధాన్ని జీవితాంతం కాపాడుకోవాలని అనుకుంటారు. అలా ఎన్నో ఊహలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ యువతీకి పెళ్లి జరిగిన వారానికే తన జీవితం మొత్తం మారిపోయింది. ఆ యువతీ తల్లిదండ్రులు పాతిక లక్షల కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసినప్పటికీ రెండేళ్లకే విడాకులకు దారితీసింది. అలా విడాకులకు దారి తీసిన విషయాలను అమ్మాయి మాటల్లోనే విందాం.. ” నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా నాన్న ఒక సంబంధం తెచ్చారు.
Advertisement
Read also: స్టార్ కమెడియన్ “ఏవీఎస్” అల్లుడు కూడా నటుడే అని తెలుసా ?
మంచి కుటుంబం, అబ్బాయి చాలా మంచివాడు అని ఒప్పుకోమన్నారు. కానీ నేను పెళ్లికి ముందు అతడితో ఒకసారి మాట్లాడాలని అడిగాను. దానికి ఒక రోజు ఇద్దరం కలిసే ఏర్పాటు చేశారు. అప్పుడు అతనితో నేను పెళ్లయిన తర్వాత కూడా స్టడీస్ కంటిన్యూ చేయడానికి కెనడా యూనివర్సిటీకి అప్లై చేశాను.. పెళ్లయిన తర్వాత కెనడా వెళ్దాం అంటే అతను సరే అన్నాడు. ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది. ఒక్కగానొక్క ముద్దుల కూతురిని కావడంతో మా నాన్న పాతిక లక్షల కట్నం ఇచ్చి మరి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత హనీమూన్ ఖర్చులు కూడా భరించి పంపిస్తామంటే దానికి మా అత్తగారి వాళ్లు ఒప్పుకోలేదు. అలా పెళ్లయిన ఒక వారం రోజుల్లోనే నా లైఫ్ మొత్తం మారిపోయింది. కేవలం ఆ ఇంటి పనిమనిషి కోసం మాత్రమే వారు ఈ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఏ పని చేయని నేను ఆ ఇంట్లో ప్రతిరోజు ప్రతి పని చేయాల్సి వచ్చింది. పనులకి తోడు చీటికిమాటికి వాళ్ళు మా ఇంటి వారిని తిట్టడం చేశారు. అలా ఒకరోజు మా అత్తయ్య ఒక్క పైసా కట్నం ఇవ్వలేదని పెద్దగా అరిచింది.
Advertisement
ఆ మాటకి నా మనసు ముక్కలైంది. దాంతో వెంటనే పుట్టింటికి వెళ్లి అక్కడ జరిగిందంతా మా నాన్నతో చెప్పేసాను. ఇంత చెప్పినా మా నాన్న బాధపడకుండా, వాళ్లని ఒక్క మాట కూడా అనకుండా అత్తింటికి వెల్లమ్మ అంతా సర్దుకుంటుందని నాకు నచ్చజెప్పి పంపించేశారు. అలా వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇంట్లో అందరూ నాతో మాట్లాడడం మానేశారు. నా పనేదో నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అలా కెనడా వెళ్లడం గురించి అడగాలనే ఆలోచన కూడా నా మైండ్ లో నుండి రాలేదు. కేవలం తిట్లు, పనులు.. అసలు మనుషులు ఇంత క్రూరంగా ఉంటారని అప్పుడు మొదటిసారి అనిపించింది. నా ఇంట్లో నేను ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఒకరోజు ఏ కారణం లేకుండా మా అత్తమ్మ మళ్ళీ పెద్ద గొడవ చేశారు. దీంతో మళ్లీ పుట్టింటికి వచ్చేసాను. కానీ ఈసారి మా నాన్న తిరిగి వెళ్ళమనలేదు. అలా నాలుగు నెలలు గడిచింది. వాళ్లు కూడా ఎవరూ కాల్ చేయలేదు. ఒకవేళ వెళితే జీవితం మళ్ళీ ఎలా మారిపోతుంది అని ఆలోచించాను.
ఇంకా ఆలోచించే బదులు నా జీవితం గురించి ఆలోచిస్తే బాగుంటుందని అనిపించి కెనడా యూనివర్సిటీ విషయం గురించి ఆలోచించాను. ఈ విషయం మా నాన్నకి చెప్పి ఒప్పించాను. అలా విదేశాలకు వెళ్లి చదువుకుంటూ, మరోవైపు కెరియర్ పై దృష్టి పెట్టి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 23 ఏళ్లు. విడాకులకి కూడా అప్లై చేశాను. కానీ వారి నుండి ఎటువంటి రిప్లై రాలేదు. ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను. నా హస్బెండ్ కూడా తన జీవితంలో హ్యాపీగానే ఉండి ఉంటాడని అనుకుంటున్నాను. మొదట్లో తనపై కోపం ఉన్నప్పటికీ ఇప్పుడు లేదు. నేను నా జీవితానికి ఏది మంచిదో అదే కావాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
Read also: అక్కినేని, తొక్కినేని అంటూ కామెంట్స్ పై సమంత రియాక్షన్ ఏంటంటే ?