Advertisement
నేటి రోజుల్లో ప్రేమ గురించి చూసుకుంటే మాత్రం ప్రేమ అనేది కేవలం ప్రాణాలు పోవడానికి మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎందుకంటే కేవలం శారీరక, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నారు ఎంతోమంది. మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచేయడం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. ఉమా అనే యువతి ఇంటర్ చదువుతుండగా రంజిత్ అనే అబ్బాయిని ప్రేమించింది. అలా ఇంటర్ పూర్తయిన తర్వాత చదువు మానేసి రంజిత్ తో తన ప్రేమ విషయాన్ని ఇంట్లో ధైర్యంగా చెప్పింది.
Advertisement
Read also: ఇదేందీ బండ్లఅన్న ? ఇదేందీ ఇది మధ్యలో చిరంజీవి ఎలా వచ్చారు …
Advertisement
ఉమా తన తల్లిదండ్రులకి నాలుగవ కూతురు. అయితే అప్పటికే ముగ్గురు కూతుర్ల పెళ్లిళ్లు చేసిన ఉమా తల్లిదండ్రులు నాలుగో అమ్మాయి ఉమకి ఆమె ప్రేమించిన అబ్బాయి తోనే వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ రంజిత్ మాత్రం రెండేళ్లుగా పెళ్లి చేసుకుంటానంటూ దాటవేస్తూ వచ్చాడు. అతని ధోరణితో విసిగెత్తిన ఉమ తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ ఉమకి వచ్చిన ప్రతి సంబంధాన్ని రంజిత్ చెడగొడుతూ వచ్చాడు. నన్నే ప్రేమించావు కనుక నన్నే పెళ్లి చేసుకోవాలని ఉమని వేధించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన ఉమా ఓ లెటర్ రాసి పురుగుల మందు తాగి ఆ* పాల్పడింది.
ఆ లెటర్ లో.. “అమ్మ నాన్న నన్ను క్షమించండి.. నేను రంజిత్ ను లవ్ చేసినందుకు వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడం లేదమ్మా. లవ్ చేశావు గనుక చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదంటే చచ్చిపో అంటున్నాడు. వాడిని పెళ్లి చేసుకుని మీకు చెడ్డపేరు తేలేను. అలా అని మీరు చెప్పిన సంబంధం చేసుకున్న వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు. బ్రతికి ఉండి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుండి మీకు జరిగే మంచి ఏమీ లేదు. గుడ్ బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్” అంటూ లెటర్ లో పేర్కొంది. ఉమా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంజిత్ పై కేసు నమోదు అయింది.
Read also: విజయ్ గారు మీకు ఇది న్యాయంగా ఉందా ? దానికి ‘నో’ దేనికి మాత్రం ఒకే…