Advertisement
ఈ కాలంలో పడుకునే ముందు ఉదయం త్వరగా నిద్ర లేవడానికి ఫోన్లలో, లేదా అలారం క్లాక్ లో అలారం పెట్టి మరీ పడుకుంటారు. అలా చాలామంది అలారం మోగుతూనే ఉన్నా కాసేపు ఆగి లేద్దాం అని బద్దకిస్తూ ఉంటారు. కానీ గతంలో ఇలా ప్రత్యేకంగా అలారం గడియారాలు ఉండేవి కావు. కానీ క్రీస్తుపూర్వం కూడా ప్రజలు అలారం క్లాకులని వాడేవారు. కానీ అవి ఈ కాలంలో వాడేంత అధునాతనమైనవి కావు కానీ అప్పట్లో జనాలకు బాగానే పనికి వచ్చాయి. క్రీస్తుపూర్వం 428 నుంచి 348 మధ్యకాలంలో జీవించిన గ్రీకు తత్వవేత్త ప్లేట్లో నీటితో నడిచే ఓ అలారం క్లాక్ ని తయారు చేశారు.
Advertisement
Read also: సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు
Advertisement
అతని దగ్గర విద్యనభ్యసించే ఓ విద్యార్థి విపరీతంగా నిద్ర పోయేవాడట. అతను సమయానికి నిద్రలేవకపోవడంతో ప్లేట్లో విసుగు చెంది అతని కోసమే ఆ వాటర్ అలారం క్లాక్ ని తయారు చేశారు. ఈ క్లాక్ లో పలు రకాల పాత్రలు, ట్యాబులు ఉంటాయి. ఈ ట్యాబుల ద్వారా నీరు ఆ పాత్రలోకి నెమ్మదిగా పడుతూ ఉంటుంది. అలా ఓ నిర్దిష్టమైన సమయం తరువాత పాత్ర నిండి దానికి ఉన్న రంధ్రాల ద్వారా ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తో ఆ విద్యార్థి మేల్కొనేవాడట.
అలా ప్లేట్లో తయారుచేసిన ఆ వాటర్ అలారం క్లాక్ కు అప్పట్లో ప్రజాధరణ బాగానే లభించింది. ప్లేట్లో తర్వాత క్రీస్తుపూర్వం 285 నుంచి 222 సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా కు చెందిన స్టేషిబియన్ అనే గణిత శాస్త్రవేత్త కూడా ఓ అలారం క్లాక్ ని తయారు చేశాడు. అయితే మొదట్లో ఆ క్లాక్ అలారం పెద్దగా సౌండ్ వినిపించేది కాదు. దీంతో స్టేషిబియాన్ దానికి కొన్ని మార్పులు చేసి పెద్ద సౌండ్ వినిపించే విధంగా మళ్లీ ఆ క్లాక్ ని రూపొందించారు. దాంతో ఆ క్లాక్ ను కూడా జనాలు అప్పట్లో వాడారు.
Read also: అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు