Advertisement
రాజమౌళి ఆలోచనలు ఇతర దర్శకుల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. జక్కన్న ఎలాంటి సినిమాలు తెరకెక్కించిన ఆ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారనే సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో రాజమౌళి తీసిన బాహుబలి సాధించిన విజయం మామూలుది కాదు. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి సినిమా టాలీవుడ్ కె కాకుండా ఇండియన్ సినిమాకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. ఇదంతా రాజమౌళి పడిన కష్టానికి ఫలితం.దాదాపు 5 ఏళ్ల పాటు బాహుబలి సినిమాకు జక్కన్న తన సమయం కేటాయించాడు.
Advertisement
గతంలో తెలుగు సినిమాను శివ సినిమాకు ముందు, శివ సినిమాకు తర్వాత అని ఎలా చెప్పారో, ఇప్పుడు బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి సినిమా తర్వాత అని విభజించి చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అలాంటి టాప్ డైరెక్టర్ తన సినిమాలో ఒక పాత సీన్ ను కాపీ కొట్టారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా విక్రమార్కుడు. ఈ సినిమాతో రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ పడటంతో పాటు జక్కన్నకు కూడా చాలా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో విలన్ తమ్ముడు సైకోల ప్రవర్తిస్తూ దారుణాలకు పాల్పడుతూ ఉంటాడు.
Advertisement
అతడు సైకోల ప్రవర్తిస్తూ ఆడవాళ్లను వేధిస్తూ ఉంటాడు. ఇక విలన్ తమ్ముడు పుట్టినరోజు నాడే రవితేజ అతడిని హతమార్చి విలన్ కు వార్నింగ్ ఇస్తాడు. అయితే అచ్చం అలాంటి సీన్ విజయశాంతి.. చేసిన శాంభవి ఐపీఎస్ సినిమాలో ఉంది. దాంతో ప్రస్తుతం విజయశాంతి సినిమాలోని సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్రమార్కుడు సినిమాలోని సీన్ ను జక్కన్న విజయశాంతి సినిమా నుండి కాపీ కొట్టాడా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
READ ALSO : బాలయ్య పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ లెటర్ అందులో ఏముందంటే?