Advertisement
నందమూరి తారకరత్న నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని సినిమాలు చేసినా అవి అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయారు. కనీసం రాజకీయాల్లోనైనా రాణిద్దామని భావించి లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంతలో ఏమైందో ఏమో పాదయాత్ర నడుస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.
Advertisement
అలాంటి నందమూరి తారకరత్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోతో సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరైనా ఇండస్ట్రీలోకి ఒకటి, రెండు సినిమాలతో ఎంట్రీ ఇస్తారు. కానీ ఈ నందమూరి హీరో వచ్చి రాగానే ఏకంగా తొమ్మిది సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొన్ని చిత్రాలు విడుదలయితే మరికొన్ని చిత్రాలు విడుదల కాలేదు. అయితే తారకరత్నకు ఈ రేర్ రికార్డు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Advertisement
చిన్న వయసులోనే తారకరత్న సినిమాల్లోకి రాగా జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా ఈ హీరో సినిమాలోకి వచ్చాడని ప్రచారం జరిగింది. బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ లక్కు లేకపోవడంతో తారకరత్న కెరియర్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఆయన నటించిన సినిమాల్లో కొన్ని విడుదలయితే మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. ఇంకొన్ని సినిమాలు పూజా కార్యక్రమం చేసి ఆగిపోయాయి. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఆయన క్షేమంగా బయటికి రావాలని మనందరం కోరుకుందాం.
also read: