Advertisement
కులం, ఈ మాట వినగానే కొంతమందికి కోపం, కొంతమందికి గర్వం. వీడు మనవాడు, వీళ్ళు మనవాళ్లు కాదు అని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ కుల వ్యవస్థ మన సామాన్య ప్రజల నుండి మనల్ని పాలన చేసే రాజకీయ నాయకులు వరకు ఉంది. అయితే ఈ కుల వ్యవస్థ తో పెళ్లిళ్లు కూడా మా కులం వాళ్లనే చేసుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తుంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వారు కొన్నిసార్లు ఫైట్ చేయలేక, అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టలేక, ఇంట్లో చూసిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే మన టాలీవుడ్ హీరోలు తారలు మాత్రం కులాంతర వివాహాలు చేసుకున్నారు. అయితే ఆ తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్
మహేష్ లాంటి హ్యాండ్సమ్ హీరోకి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మహేష్ ని ప్రేమించేలా చేసింది నమ్రత. నార్త్ ఇండియన్ అయినా నమ్రతది వేరే కులమైన ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు మహేష్.
# రామ్ చరణ్-ఉపాసనకామినేని
మెగాస్టార్ కొడుకుగా అప్పటికే సినిమాల్లో సూపర్ ఫామ్ లో ఉన్న చరణ్ ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది అందరికీ ఉండేది. కానీ చరణ్ కూడా ప్రేమ వివాహానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అది కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఉపాసన కామినేని పెళ్లి చేసుకున్నాడు.
# అల్లు అర్జున్-స్నేహ రెడ్డి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది కూడా ప్రేమ వివాహమే. కులాంతర వివాహమే చేసుకున్నాడు. తన తండ్రిని ఒప్పించి మరి స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు.
Advertisement
# నాగచైతన్య-సమంత
నాగార్జునకి తెలియకుండా చాలా పెద్ద సీక్రెట్ లవ్ స్టోరీ నడిపిన కూడా లాస్ట్ కి రెండు ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్ తో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు వీరు. అంతేకాదు వీళ్ళ కులంతో పాటు మతాలు కూడా వేరు అవడంతో వీళ్ళు రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.
# నాగార్జున- అమల అక్కినేని
అక్కినేని నాగార్జున ఎప్పటికీ వయసులో తగ్గడు అంటారు. అలాంటి నాగ్ ని ప్రేమలో పడేసింది అమల. కిరాయి దాదా షూటింగ్ టైం లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏఎన్ఆర్ పర్మిషన్ తో పెళ్లి చేసుకున్నారు. అమలా నార్త్ ఇండియన్ అయినా కూడా ఇక్కడ సాంప్రదాయం తోనే పెళ్లి చేసుకున్నారు.
# మంచు బ్రదర్స్
అన్న మంచు విష్ణు అలాగే తమ్ముడు మనోజ్ ఇద్దరూ కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. చూడడానికి ఈ సీరియస్ గా కనిపించే మోహన్ బాబు గారిని ఒప్పించి మరి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.
# పూరి జగన్నాథ్-లావణ్య
దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంత ఫాస్ట్ గా సినిమాలు తీస్తాడో అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి జగన్ ఒకరోజు షూటింగ్ లో లావణ్య గారిని చూసే ప్రేమలో పడ్డారు. ఎవరికీ తెలియకుండానే పెళ్లి చేసుకొని ఇప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉన్నారు.
# మణిరత్నం-సుహాసిని
సుహాసిని మణిరత్నం తెలుగులో అప్పటికే టాప్ హీరోయిన్. అయితే మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిది కూడా కులాంతర వివాహమే.
READ ALSO : కృష్ణ వీలునామాలో కీలక విషయాలు.. ఆస్తులు మొత్తం వాళ్ళకే..?