Advertisement
భారతదేశంలోని మహాశివరాత్రి వచ్చిందంటే చాలు చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. శివున్ని భక్తితో పూజించి ఆయన అనుగ్రహం పొందాలని అనుకుంటూ ఉంటారు. ఈ రోజే జాగరణ ఉపవాసాలు కూడా ఉంటారు. దీనివల్ల శివుడి ఆశీస్సులు లభిస్తాయని శుభం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన వస్తోంది. శివరాత్రి పర్వదినం రోజున స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఈ సాంకేతాలు కనిపిస్తే మీపై శివుడి అనుగ్రహం ఉన్నట్టే.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Advertisement
మహాశివరాత్రి కి కొన్ని రోజుల ముందు కలలో లింగానికి పాలతో అభిషేకం చేస్తున్నట్టు మీకు కనిపిస్తే అన్నీ కష్టాలు దూరమవుతాయని అర్థం. ఇంకా చెప్పాలంటే రుద్రాక్షను శివుడి స్వరూపంగా పరిగణిస్తారు. మహాశివరాత్రికి ముందు రుద్రాక్ష మాలలోని ఒక రుద్రాక్ష కలలో కనిపిస్తే అది శివుని అనుగ్రహం మీపై ఉన్నట్టు భావించాలి. దీనివల్ల మీకు రోగాలు,దుఃఖాలు లేకుండా పోతాయి.
అంతేకాకుండా మీకు శివుడు పార్వతి కలిసి కూర్చున్నట్టు కనిపిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో సమస్యలని తీరిపోయి వారి జీవితంలో సంతోషం రాబోతుందని నమ్మాలి. ఒకవేళ శివరాత్రికి ముందు నాగదేవత మీ కలలో కనిపించినట్టయితే శివుడి అనుగ్రహం మీపై పడబోతుందని దీనివల్ల మీరు ఆర్థికంగా బలపడతారని అర్థం చేసుకోవాలి.
also read: