Advertisement
లెజెంటరి సింగర్ వాణి జయరాం మరణ వార్తతో ఇండస్ట్రీ షాక్ అయింది. చెన్నైలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఆమె మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 14 భాషలలో సుమారు పదివేలకు పైగా అద్భుతమైన పాటలను ఆలపించారు వాణి జయరాం. వాణి జయరాం తమిళనాడులోని వెల్లూరులో వారి తల్లిదండ్రులకు 8 మంది సంతానంలో ఐదవ పుత్రికగా 1945 నవంబర్ 30వ తేదీన జన్మించింది. తన ఎనిమిదవ ఏటనే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది. వివాహనంతరం భర్తతో ముంబైలో లో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయిని కలవడం, అనంతరం రిషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చిత్రం “గుడ్డి” బోలే రే పపి హరా” ద్వారా సింగర్ గా అరంగేట్రం చేసి తన చిన్ననాటికలను నిజం చేసుకుంది.
Advertisement
Read also: దగ్గు బాటి రానా కి ఆ పేరు ఎందుకు పెట్టారు ? ఆ పేరు వెనక స్టోరీ ఏంటో తెలుసా ?
Advertisement
ఐదు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడి ఉత్తమ గాయనిగా మూడుసార్లు జాతీయ పురస్కారం అందుకుంది. చిత్ర సీమకు ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అది అందుకోకముందు కన్నుమూయడంతో ఆమె అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు. అయితే తాజాగా ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై గాయాలు ఉన్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాణి జయరాం మరణించే ముందు తన గదిలో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయని తన పనిమనిషి తెలియజేశారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు వాణి జయరాం ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో ఆమె పనిమనిషి చెన్నై మైలార్ పూర్ లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిందని, కొద్దిసేపటి తరువాత వచ్చిన బంధువులు తలుపులను పగలగొట్టి చూడగా తీవ్ర గాయాలతో గ్లాస్ టేబుల్ పై పడి ఉన్నారని తెలిపారు. ఆమె ముఖానికి బలమైన గాయాలు ఉన్నాయని, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా గాయాలు ఉన్నాయని వివరించారు. ఆ సమయంలో ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స చేయడం ప్రారంభించారు. అనంతరం కొంతసేపటికి ఆమె తుదిశ్వాస విడిచారు. పనిమనిషి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఆమె ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.
Read also: SS రాజమౌళి తీసిన సినిమాల్లో భార్య రమా రాజమౌళి గారికి అస్సలు నచ్చని సినిమా ఏదంటే ?