Advertisement
టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే, మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. వారిలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలుగా మారారు. అయితే వివాదాలతో సినీ కెరియర్ లేకుండా చేసుకున్న నటీనటులు ఎవరో మీకు తెలుసా? వారెవరో ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జనాలకి సుమన్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది.
Advertisement
కానీ ఆయన ఒక అమ్మాయికి సంబంధించిన కేసులో ఇరుక్కోవడం వల్ల తన సినీ కెరియర్ తానే నాశనం చేసుకున్నాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా కూడా అవి సరిగ్గా ఆడకపోవడంతో హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ లిస్టులో తర్వాత చెప్పుకోవాల్సిన పేరు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలోకి రాగానే వరుసగా మూడు హిట్లు కొట్టిన తర్వాత అందరూ తనకి మంచి కెరియర్ ఉంది అని అనుకున్నారు. కానీ ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు కాబోతున్నాడు అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ సడన్ గా చిరంజీవి కూతురుని ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకోవడం లేదు అని తెలిశాక ఆయనకి వచ్చిన ఆఫర్స్ అన్ని చేజారిపోయాయి.
Advertisement
దాంతో ఆయన సినీ కెరియర్ ముగిసిపోయింది. ఇలా అన్నీ కారణాలని మైండ్ లో పెట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్లి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే చిత్రం శ్రీను. ఈయనకి కామెడియన్ గా మంచి గుర్తింపు వస్తున్న టైంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతని మొదటి భార్య శీను మీద కేసు పెట్టి కోర్టు ముందే అతన్ని, ఆయన పెళ్లి చేసుకున్నామని కొట్టింది. దాంతో జనాల్లో చిత్రం శీను అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అలా అతనికి సినిమాలు కూడా తగ్గాయి.
READ ALSO : పెట్రోల్, వాటర్, పాల ట్యాంక్లు మాత్రమే ఎందుకు ఇలాంటి ఆకారం లో ఉంటాయి ? దీనికి కారణం ఏంటంటే ?