Advertisement
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రాంచరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అంచనాలు మామూలుగా ఉండవు. అందులో రామ్ చరణ్, చిరు కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగే అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తుకు రాలేదు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది.
Advertisement
Read also: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు వీటి ధరలు ఎంతంటే ?
మెగాస్టార్ కెరియర్ లోనే వరస్ట్ సినిమా అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొరటాల ఇలాంటి సినిమా చేయడమేంటని అంత ఆశ్చర్యపోయారు. ఒక సింపుల్ స్టోరీ లైన్ ని డెవలప్ చేసి అందులో కమర్షియల్ అంశాలు జోడించి మెప్పించడంలో కొరటాల దిట్ట. అయితే ఆచార్యకి వచ్చేసరికి మొదటిసారి తను ఎక్కడ స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడో అక్కడే వీక్ అనిపించుకుని మిస్టేక్ చేశాడు. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటిలోను, టెలివిజన్లోనూ విడుదలైంది. కానీ సినిమాలోని మిస్టేక్స్ ను ఎవరు గమనించలేదు. తాజాగా ఈ సినిమాని ఓటిటి, టీవీలో చూసిన తర్వాత తప్పులను పట్టుకొని మరీ ట్రోల్ చేస్తున్నారు నేటిజెన్లు.
Advertisement
ఈ చిత్రంలో మెగాస్టార్ రథాన్ని తోసే ఓ సీన్ ఉంటుంది. సినిమాలో ఘట్టమ్మ వారి ఆలయం ముందు నుండి అమ్మవారి రథం లాగే ఈ సీన్ లో ముందు నుండి కొందరు రధాన్ని లాగుతుంటే చిరంజీవి వెనక నుండి తోస్తారు. అయితే ఈ సీన్ లో మెగాస్టార్ కాళ్లకు షూ ధరించి ఉంటారు. నిజానికి ఆలయాలలోకి వెళ్లేటప్పుడు, దేవుడికి సంబంధించిన పనులను చేసేటప్పుడు భక్తులు చెప్పులను అసలు ధరించరు అన్న సంగతి తెలిసిందే. కానీ మెగాస్టార్ ఆలయాల గురించి సినిమా చేసి అలా ఎలా మిస్టేక్ చేశారని నేటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
Read also: తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !