Advertisement
మన దేశంలో ప్రజలకు అత్యంత చేరువైన మాధ్యమాలలో సినిమా ఒకటి. సినిమా చూడని ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ సినిమాను ఆస్వాదిస్తారు. సినిమా రంగంలో పాత్ర కన్నా పాత్రధారికే విలువ ఎక్కువ. సినిమాలో కథ కొంతవరకు ముఖ్యమే కావచ్చు కానీ సినిమా ఆడడం అనేది ఎక్కువగా నటీనటులపై, అందులో ముఖ్యంగా సినిమా హీరో పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఓ సమస్యను హైలైట్ చేస్తారు. ఏదో విధంగా పరిష్కరిస్తారు. ఒక్కోసారి కొన్ని సినిమాలలో ఈ పరిష్కారం జనాలను ఆలోచింపజేస్తుంది. అలా ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెండు చిత్రాలలోని సన్నివేశాలు ఒకేలా అనిపించినా అందులో హీరోలతో తప్పు చేయించి మరి క్లాస్ పీకడం అవసరమా? అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ సినిమాలు ఏవి? ఆ సినిమాలో ఆ సన్నివేశం ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: బాలయ్య బాబు “అఖండ” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?
2003లో జక్కన్న దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం సింహాద్రి. ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ మొదలవగానే నాజర్ కూతురు సీత పాతికేళ్ల క్రితం భానుచందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దాంతో నాజర్ భానుచందర్ ని కొడతాడు. అప్పుడు వీరు ఇంటిని వదిలి కేరళ కి వెళ్లి స్థిరపడతారు. అలా వీరిని కలిపి ఎందుకు సింహాద్రి నాజర్ కి తెలియకుండా కేరళ వెళతాడు. వారిని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో భూమిక నీ ప్రేమలో పడేసి లేచి పోదామా అన్నప్పుడు భానుచందర్ ఎన్టీఆర్ ని కొట్టే సన్నివేశం ఉంటుంది. అప్పుడు ఎన్టీఆర్ ఓ క్లాసు పీకుతాడు. అచ్చం ఇలానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 2013లో విడుదలైన అత్తారింటికి దారేది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో సునంద తన తండ్రి (రఘు) ఇష్టానికి వ్యతిరేకంగా రావు రమేష్ ( శేఖర్) అనే ప్లీడర్ ని పెళ్లి చేసుకుంటుంది.
Advertisement
అందుకు ప్రతికార చర్యగా రఘు వారిద్దరిని ఇంటి నుండి వెళ్లగొడతాడు. ఇక వీరిని మళ్ళీ కలిపేందుకు రఘు మనవడు గౌతమ్ నంద తన అనుచరులతో కలిసి ఇండియాకి వెళతాడు. హైదరాబాద్ విమానాశ్రయం దగ్గర శేఖర్ గుండెపోటుకి గురైతే గౌతమ్ అతనిని కాపాడి ఆసుపత్రిలో చేరుస్తారు. అందుకు కృతజ్ఞతగా శేఖర్ గౌతమ్ ని తన డ్రైవర్ గా నియమిస్తాడు. సిద్దు అనే పేరుతో ఆ ఇంటికి వెళ్లిన గౌతం సునంద ఇద్దరి కూతుర్ల గురించి తెలుసుకొని శశి ( సమంత) ని ప్రేమలో పడేస్తాడు. ఇక సినిమా ఎండింగ్ లో వీరిద్దరూ చెన్నైకి పారిపోవాలనుకుంటారు. అప్పుడు రైల్వే స్టేషన్ లో జరిగే ఈ సన్నివేశం సినిమాకి హైలైట్. రైల్వే స్టేషన్ లో శేఖర్ వచ్చి గౌతంపై చేయి చేసుకుంటాడు. ఆ సమయంలో గౌతమ్ ఓ క్లాస్ పీకే సన్నివేశం ఉంటుంది. అయితే ఈ రెండు చిత్రాలలో ప్రేమ వివాహం చేసుకొని తండ్రిని వదిలి వెళ్లిపోయిన కూతురిని తీసుకురావడానికి హీరోలు వారి దగ్గరికి వెళతారు. ఆ సమయంలో వారి కూతురిని ప్రేమలో పడేసి మళ్లీ తిరిగి వారికే క్లాస్ పీకుతారు. హీరోలతో తప్పులు చేయించి మరీ క్లాస్ పీకడం అవసరమా అంటూ.. ఈ రెండు సినిమాలలోని సన్నివేశాలని జోడించి నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
Read also: డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!