Advertisement
భార్య, భర్తల బంధం ఎంతో మధురమైనది. వారు నిత్యం కలిసిమెలిసి ఉంటేనే.. వారి కాపురం సజావుగా సాగుతుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా ఉండాలి. లేకపోతే వారి మధ్య విభేదాలు ఎక్కువ అవ్వడం తప్ప… మరి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయితే చాలామంది తమ భర్తల పై భార్యలు ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ భర్త లపై అతి ప్రేమ కూడా… ఓ పెద్ద రోగమే అని చెబుతున్నారు నిపుణులు. అయితే భర్త వద్ద ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. డిస్టెన్స్ రిలేషన్ షిప్:
భార్య భర్తల ప్రేమ వర్ణించలేనిది. ఇందులో కొంతమంది భార్యలకు భర్త అంటే చాలా ప్రాణం. ఇలా ఉండటం చాలా మంచిది. కొంతమంది భార్యలు తన భర్తకు అవసరానికి మించిన సేవలు చేస్తూ, తాను అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి సేవలు చేయడం మంచిది కాదట.
Advertisement
2. తరచూ క్షమించరాదు:
భార్య, భర్తలు అన్నాక విభేదాలు రావడం చాలా కామన్. ఈ గొడవలో భార్యాభర్తల మధ్య గొడవ ఒకరికి మాత్రమే తప్పు కావచ్చు. ఒకవేళ తప్పు చేసింది నీ భర్త అయితే మాత్రం మీరు క్షమించవచ్చు. ఇలా ఒక్కసారి జరిగితేనే క్షమించండి. కానీ తరచూ ఇలా తప్పులు చేస్తే మాత్రం… ప్రతిసారి వారిని క్షమించి వదిలి వేయడం మంచిది కాదు.
3. భర్తతో సమయాన్ని గడపడం:
చాలా మంది భార్యలు తన భర్తతో సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పులేదు ఎక్కువ సమయం గడపడం కూడా కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల మీకు వారు మాత్రమే సర్వస్వమని, వారు లేకుంటే బ్రతుకలేను అనే భావనకు వస్తారట.
4. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:
చాలామంది మహిళలు తన భర్త కుటుంబం వంటివాటిపై దృష్టి పెట్టి వారి గురించి వారు పట్టించుకోవడం మానేసారు. దీని వల్ల ఆరోగ్యం నాశనం అవుతుంది. కాబట్టి వారిపై వారి దృష్టి పెట్టుకొని ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవడం మంచిది.
Also Read: దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?