Advertisement
ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు.. చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని నాలుగు రహస్యాలు ఏంటో చూద్దాం..
Advertisement
బలహీనత:
ఏ మనిషికైనా బలహీనత ఉంటుంది. ముఖ్యంగా ఈ బలహీనతను ప్రతి భర్త భార్యకు తెలియనివ్వకూడదు . ఒకవేళ భార్యకు తెలిస్తే ఆమె పదేపదే ప్రస్తావిస్తూ భర్తను బలహీన పరుస్తుంది.
Advertisement
ఆదాయం:
ముఖ్యంగా భర్త సంపాదించే సంపాదన కూడా భార్యకు తెలియనివ్వకూడదని ఆచార్య చాణిక్యుడు అన్నారు. ఒకవేళ భర్త ఆదాయం భార్యకు తెలిస్తే దుబారా ఖర్చులు పెరుగుతాయట. ఒక్కోసారి ఈ ఖర్చులు ఆదాయాన్ని మించి పోయేలా ఉంటాయి. అందుకే సంపాదన భార్య చెప్పకూడదని చాణక్యుడు అంటున్నారు.
చేద్దామనే సహాయం:
మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే సైలెంట్ గా చేసేయండి. నీ భార్యకు మాత్రం చెప్పకండి అంటున్నారు. తన భర్త తాను చేయాలనుకున్న సహాయాన్ని భార్య దగ్గర చెబితే సమస్యలు ఎదురవుతాయి. అడ్డుపడే అవకాశం ఉందని చాణిక్యుడు అంటున్నారు.
అవమానం:
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పొందిన అవమానాన్ని భార్యకు తెలియనివ్వకూడదు. ఎప్పుడైతే తాను అవమానించబడినట్టు తన భార్యకు తెలుస్తుందో అప్పటినుంచి భర్తను చులకనగా చూడడం ప్రారంభిస్తుందని చాణక్యుడు అంటున్నారు.