Advertisement
మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ, ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. రైలు పట్టాలను మీరు ఎప్పుడైనా గమనించారా..? పట్టాల మధ్య, చుట్టుపక్కల కంకర రాళ్లు వేసి ఉంటాయి.
Advertisement
అలా కంకర రాళ్లు ఎందుకు వేశారో అనే విషయం చాలామందికి తెలియదు. వాటి గురించి పెద్దగా పట్టించుకోము కూడా. అయితే ఆ కంకర రాళ్లను ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. రైలు పట్టాలను వేసేముందు ప్రత్యేక దిమ్మెలను భూమిపై పరిచి వాటిపై రైలు పట్టాలను అమర్చుతారు. ఆ తర్వాత పట్టాలకు ఇరువైపులా, మధ్యలో కంకర రాళ్ళను వేస్తారు. అయితే ఈ కంకర రాళ్ల వల్ల పట్టాల కింద ఉండే దిమ్మెలు కదలకుండా దృఢంగా ఉంటాయి.
Advertisement
దీనివల్ల రైలు వెళుతున్నప్పుడు ప్రమాదం ఉండదు. ఇంతేకాక వర్షం పడినప్పుడు కంకర రాళ్లు ఉండటం వల్ల నీరు భూమిలోకి ఇంకిపోతోంది. దీంతో రైలు రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. అలాగే భూమిపై చిన్న చిన్న మొక్కలు, లేదా ముళ్ళపొదలు పెరుగుతూ ఉండడం చూస్తాం. కానీ రైలు పట్టాల మధ్య కంకర ఉండడం వల్ల అలాంటి మొక్కలు, ముళ్ళపొదలు లాంటివి ఏవీ పెరగవు. దీంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. అలాగే రైలు పట్టాల మీద వెళ్లేటప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గిస్తుంది. అందుకే రైలు పట్టాల చుట్టూ ప్రక్కల గాని, మధ్యలో కానీ కంకర రాళ్లు వేస్తారు.
Read Also : “కొమరం భీముడొ” పాటలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టడం వెనక ఇంత స్టోరీ ఉందా ?