Advertisement
బుల్లితెర నవ్వుల నవాబు నాగబాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలను సైతం తీశారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణరంగం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో మరోసారి నిర్మాతగా మారారు. ఇటీవల పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, అటు రాజకీయాలలో సైతం చురుకుగా పాల్గొంటున్నారు. అయితే నాగబాబు 29 సంవత్సరాలు వరకు బ్రహ్మచారి గానే ఉండిపోయారు.
Advertisement
Read also: ప్రభాస్ తండ్రి, తారకరత్న, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి ఉన్న కామన్ పాయింట్ ఇదేనా ?
రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్న సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్లిలో చూసి ఈ అమ్మాయి ఎవరో బాగుందని అనుకున్నారట. పద్మజ బంధువుల అమ్మాయి అని తెలిసి అంజనాదేవి సంబరపడిందట. ఈ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుంటుందని అనుకుందట. అయితే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని. అంతేకాదు చిరంజీవికి సంబంధించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఆల్బమ్ ని తయారు చేసిందట పద్మజ. ఓసారి వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించడంతో మురిసిపోయిన అంజనాదేవి ఆమెను ఇంటి కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట.
Advertisement
ఆ విధంగా పద్మజ నాగబాబుని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలో భాగం అయింది. పద్మజ కొణిదెల ఎక్కువగా వార్తలలో కనిపించరు. మెగా ఈవెంట్లలోను, మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లోనూ అంతగా ఎక్కువగా కనిపించరు. ఈమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా ఉండేది. ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సాయం చేసింది. తన నగలు అమ్మి మరీ అప్పులు తీర్చమని చెప్పగా.. ఆ విషయం తెలిసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట. ఆ సమయంలో చిరు, పవన్ కలిసి నాగబాబుని ఆర్థికంగా గట్టి ఎక్కించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Read also: ఇన్ని రోజులు ఉదయకిరణ్ విషయంలో తప్పు చిరంజీవిది అనుకున్నారు ? అసలు వాస్తవం ఏంటంటే ?