Advertisement
సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకొని వెండితెరపై ఓ వెలుగు వెలగడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
Advertisement
అయితే, ఎన్టీఆర్ కి హిందూధర్మం అన్న ఆచారాలు, సాంప్రదాయాలు, తెలుగు భాష అన్నా కూడా ఎంతో గౌరవం ఉండేది. ఎన్టీఆర్ తన కొడుకులు, కూతుళ్లకు, మనవరాళ్ళకి పెట్టిన పేర్లు చూస్తే ఆయన భాషాజ్ఞానం భాష పై ఉన్న ప్రేమ మనకు అర్థమయిపోతాయి. కుమారులు కూతుళ్ళ పేర్లకు కూడా చివరన ప్రాస కుదిరేలా ఎన్టీఆర్ నామకరణం చేయడం విశేషం. ఏడుగురు కొడుకుల పేర్ల చివరన కృష్ణా అనే పదం ఉండేలా పేర్లు పెట్టారు. రామకృష్ణ, సాయికృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ అని ఇలా పేర్లు పెట్టారు. ఇక కూతుర్ల విషయానికొస్తే నలుగురు కూతుర్ల పేర్ల చివర ఈశ్వరి అనే పేరు వచ్చేలా పేర్లు పెట్టారు.
Advertisement
లోకేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి అని నామకరణం చేశారు. ఇక రెండో తరంలోను ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తె పేరు కుమిదిని అని పెట్టగా, రెండవ కుమారుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా వారి పేర్లు శ్రీమంతుని, మనశ్విని అని నామకరణం చేశారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వినిగా పేరు పెట్టారు. చిన్న కుమారుడు సాయి కృష్ణ కుమార్తె పేరు కూడా ఈషాని అని ఎన్టీఆర్ ఏ పెట్టారట. ఇక ఈ పేర్లు వింటేనే ఎన్టీఆర్ ది ఎంత కళాత్మక హృదయం అర్థం చేసుకోవచ్చు.
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?