Advertisement
Astrologer Venu swamy Wife Name: సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడం, అందుకు తగిన విధంగా వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత. నాగచైతన్య – సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణు స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే నాలుగేళ్లు తిరగకముందే చైతు – సమంత విడాకులు తీసుకోవడంతో వేణు స్వామి పేరు వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల టాలీవుడ్ లో త్వరలో ఒక యంగ్ హీరో, ఒక యంగ్ హీరోయిన్ చనిపోతారంటూ ఆయన రెండు నెలల కిందట వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పేరు అందరినోళ్ళలో నానుతోంది.
Advertisement
Read also: ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?
Advertisement
అయితే వేణు స్వామి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన సతీమణి ఎవరో కాదు చిత్ర పరిశ్రమలో ఆమె వీణ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. Venu Swamy Wife Name Veena Srivani ఆమె పేరు వీణ శ్రీవాణి. అందంగా వీణ వాయిస్తూ దానినే తన ఇంటిపేరుగా మార్చుకుంది. అంతేకాదు వేణు స్వామి, శ్రీవాణిది లవ్ మ్యారేజ్ కావడం మరో విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె వేణు స్వామి తో లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీవాణిది పూర్తి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఈమె అసలు పేరు పి సత్యవాణి. చిన్ననాటినుంటే విలువలు, కట్టుబాట్ల మధ్య పెరిగింది. దీనికి తోడు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి. ఈమె ఇంటర్ చదివే రోజుల నుంచి పిల్లలకు వీణా క్లాసులు చెప్పేవారు. అలా సంపాదించిన డబ్బుతో తన ఖర్చులకు వినియోగించుకునేవారు. శ్రీవాణికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో ఉద్యోగం వచ్చింది.
ఆ ఉద్యోగ శిక్షణ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన సమయంలోను వీణా క్లాసులు నిర్వహించేవారు. అలా ఒక రోజు క్లాస్ పూర్తయిన తర్వాత తన వద్ద శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిని ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఒక వ్యక్తి వచ్చారు. అక్కడ శ్రీవాణిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆయనే వేణు స్వామి. ఆ సమయంలో ఆయన ఓ సాధారణ వ్యక్తి. తన కజిన్ వాళ్ల కుమార్తెను తీసుకువెళ్లేందుకు వచ్చి శ్రీవాణిని చూసి.. ఇక తరచూ అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇక నెమ్మదిగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఓ రోజు నేరుగా నన్ను పెళ్లి చేసుకుంటారా..? అని అడిగారు వేణు స్వామి. దీంతో ఆయన మంచితనం చూసి ఓకే చెప్పేసానని తెలిపింది శ్రీవాణి. వీరి వివాహం 2002లో జరిగింది.
Read also: ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు