Advertisement
ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. పూర్వకాలంలో ఏడు రోజుల పెళ్లి అంటూ చేసేవారు. ఇప్పుడు అవన్నీ పోయి సోషల్ మీడియా పెళ్లి వరకు వచ్చింది. ప్రస్తుతం పెళ్లి విషయంలో పెళ్లి కార్డు నుంచి పెళ్లి వేదిక వరకు అన్ని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ చెందిన ఒక వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింటా వైరల్ అవుతుంది. పెళ్లి ఫంక్షన్లలో బంధువులు మందు తాగి చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండడం చూసాం.
Advertisement
Also Read: ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?
అయితే కొన్ని సందర్భాలలో స్వయంగా పెళ్లి కొడుకు తాగి రావడం పెళ్లి ఆగిపోవడం వంటి ఘటనలు జరిగాయి. అయితే గుజరాత్ లోని రాజ్కోట్ హడాల గ్రామానికి చెందిన మున్సిక్ సీతాఫరా కూతురు వివాహం జరిగింది. వివాహ పత్రికలో మందు తాగి ఉంటే పెళ్ళికి రావద్దని ప్రింట్ చేయించారు. తాగి తూలే అతిథులు మరియు గొడవలకు దూరంగా ఉండాలని ఈ ఆలోచన చేసినట్టు వారు చెబుతున్నారు..
Advertisement
ఈ పెళ్లి పత్రిక గురించి ఆ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు మాట్లాడుతూ .. ఇటీవల మా గ్రామంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఇద్దరు మందు తాగి వచ్చి గొడవపడ్డారు. అది అనేక వివాదాలకు దారితీసింది. అలాంటి తప్పు మా కుటుంబంలో జరగకూడదని ఈ విధమైన ఆలోచన చేసి ముందుగానే పెళ్లి పత్రికలో ఇలా అచ్చు వేయించామని తెలియజేశారు. దీనివల్ల ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి కార్యక్రమం హ్యాపీగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్డుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు..! ఇక మీ ఇల్లంతా డబ్బే డబ్బు..!!