Advertisement
SS Rajamouli: రాజమౌళి కెరీర్ లో మగధీర ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సాధారణ సన్నివేశాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దర్శకుడు రాజమౌళి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నారు. మగధీర సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయిన సమయంలో గుర్రం సాయం చేస్తుందనే సంగతి తెలిసిందే.
Advertisement
READ ALSO : దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !
తాజాగా ఒక సందర్భంలో ఈ సీన్ గురించి జక్కన్న మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, కొదమ సింహం మూవీలో రౌడీలు చిరంజీవిని ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోగా గుర్రం చిరంజీవి నోటికి తాడును అందించి చిరంజీవి ప్రాణాలను కాపాడుతుందని అయితే ఆ ప్రాణాలు కాపాడిన చిరంజీవికి, గుర్రానికి మధ్య అనుబంధం లేకపోవడంతో తాను నిరుత్సాహపడ్డానని జక్కన్న తెలిపారు. తన దృష్టిలో అది గుర్రం కాదని ప్రాణాలు కాపాడిన వ్యక్తి అని జక్కన్న చెప్పుకొచ్చారు.
Advertisement
READ ALSO : వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?
ఆ సీన్ మైండ్ లో ఉండిపోవడంతో మగధీరలో గుర్రం చరణ్ ను కాపాడిన తర్వాత చరణ్ గుర్రంతో కృతజ్ఞతాభావంతో మాట్లాడేలా సీన్ రాశానని జక్కన్న తెలిపారు. ఇసుక ఊబి నుంచి బయటకు వచ్చిన చరణ్, గుర్రాన్ని కౌగిలించుకుంటాడని ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందిన సన్నివేశాలను తాను తెరకెక్కించానని రాజమౌళి పేర్కొన్నారు. చిరంజీవి అలా చేయలేకపోయినా చరణ్ తో ఆ సీన్లను చేయించానని రాజమౌళి చెప్పకనే చెప్పేశారు.
READ ALSO : మన టాలీవుడ్ తారలు.. వారి మధ్య ఉన్న బంధుత్వాలు