Advertisement
లెజెండ్రీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విషయం తెలిసిందే. కృష్ణ గారి భార్య ఇందిరా దేవి మరణించి నెలలు కూడా గడవకముందే కృష్ణ గారు మరణించడంతో ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి మరణం మహేష్ బాబును కలచివేసింది. కృష్ణ గారు వేలకోట్ల ఆస్తులు కూడబెట్టలేకపోయినా.. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. మామూలుగా కృష్ణ సినీ రంగంలో సూపర్ స్టార్ గా ఉండడంతో కృష్ణ భార్య అనగానే మనకు విజయనిర్మలే గుర్తుకు వస్తారు. విజయనిర్మల కృష్ణకు రెండో భార్య.
Advertisement
Read also: భారతదేశ చరిత్రలో ఎక్కవ కాలం సీఎం పదవిలో నాయకత్వం వహించిన నాయకులు వీరే ..!
అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిగి నరేష్ కూడా పుట్టేశాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో ఉండడం, కృష్ణతో చనువుగా ఉన్న నేపథ్యంలో భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసి అధికారికంగానే కృష్ణును రెండవ పెళ్లి చేసుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ తన రెండో భార్య విజయనిర్మల చనిపోయిన తరువాత తనతో ఎలాంటి బంధం లేని నరేష్ కుటుంబంతో ఉన్నారు. అలా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించి ఓసారి సమాధానం కూడా ఇచ్చారు కృష్ణ. తనకు ఎలాంటి అవసరం వచ్చినా క్షణాలలో అది చేసి పెట్టేది కేవలం నరేష్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
Advertisement
అంతేకాదు అతను షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించే ఎప్పుడు ఆలోచిస్తాడని, ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పుకొచ్చారు. అయితే మహేష్ బాబు స్టార్ హీరోగా బిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నివాసంలో కేవలం భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార ఉంటారు. ఇక నమ్రత మహేష్ స్థాపించిన వ్యాపారాలను చూసుకుంటుంది. పిల్లలు స్కూల్ కి వెళతారు. ఆ సమయంలో మహేష్ పై భారం పెట్టడం ఇష్టం లేక వారికి భారంగా ఉండకూడదని కృష్ణ నరేష్ ఇంట్లో ఉన్నాడని టాక్. ఇక కృష్ణ అంత్యక్రియల సమయంలోనూ నరేష్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.
Read also: వ్యక్తి మరణించడానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.. గరుడపురాణంలోని కీలక విషయాలు..!!