Advertisement
మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. లెక్కబెట్టలేని విధంగా దేవాలయాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అయితే… మన దేశంలోని ప్రతి దేవాలయాల్లో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలు గా భక్తులు ధరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు? ఆ మౌళి చేతికి కంకణంగా ఎందుకు ధరిస్తారు? అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? దాన్ని ఎందుకు కడతారో తెలుసుకుందాం.
Advertisement
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!
బలిచక్రవర్తి కథ తెలుసుకుంటే మౌలి గురించిన వివరణ తెలుస్తుంది. బలి చక్రవర్తిని అంతమొందించేందుకు శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. బలి నిజానికి అసురుడే అయినా దానాలు చేయడంలో చాలా గొప్పవాడు. బలి చక్రవర్తి తన వద్దకు వచ్చిన వామనుడిని చూసి ఏం కావాలో కోరమంటాడు. దానికి వామనుడు మూడు అడుగుల స్థలం కావాలని అడుగుతాడు. వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగును ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమని అంటాడు.
Advertisement
ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతడు పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దానగుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడుగా ఉండేలా వరమిస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్నికడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు. అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి లు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇది ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశమన్న మాట.
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!