Advertisement
Sr Ntr Family Members and Details: సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. అయితే, ఈ సీనియర్ ఎన్టీఆర్ కు మొత్తం 12 మంది సంతానం. ఇందులో ఎనిమిది మంది కుమారులు, నలుగురు అమ్మాయిలు. పురందేశ్వరి అమ్మాయిలలో పెద్దది.
Advertisement
దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వివాహం చేసుకున్న పురందేశ్వరి రాజకీయాల్లో రాణిస్తోంది. ఆమె తర్వాత లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి ఉన్నారు. ఇక అబ్బాయిలు ఎనిమిది మందిలో చాలా పాపులర్ అయింది బాలకృష్ణ. ఆయన రాజకీయాలు మరియు సినిమాల్లో స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత హరికృష్ణ తెలుగు ప్రజలకు పరిచయమే. కానీ మిగతా ఆరుగురు కుమారుల గురించి చాలామందికి తెలియదు. ఇందులో ఎన్టీఆర్ కి మొదటి సంతానమైన అబ్బాయి రామకృష్ణ. ఆయన నిర్మాతగా మారారు. ఆయన పేరున ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. కానీ రామకృష్ణ కన్నుమూశారు. రెండవ సంతానంగా జయకృష్ణ.
Advertisement
ఈయన కూడా ఎక్కువ మందికి తెలియదు. మూడో కుమారుడు పేరు సాయికృష్ణ. ఈయన 2004లో చనిపోయారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో సాయికృష్ణ ఆకాల మరణం పొందారు. ఇక నాలుగవ సంతానం హరికృష్ణ. ఈయన జనాల్లో ఎక్కువగా పాపులారిటీ సాధించిన హీరో. రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ కు రైట్ హ్యాండ్ గా ఉండే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయన కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక ఎన్టీఆర్ ఐదవ కుమారుడు మోహనకృష్ణ. ఈయన గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఇక ఆరవ కొడుకు బాలకృష్ణ. ఈయన ఇండస్ట్రీలో బాల నటుడిగా అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హోదాలో కొనసాగుతున్నాడు.