Advertisement
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్, లాప్టాప్ తప్పనిసరి అయిపోయింది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ కూడా ఉంటుంది. ఇదే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో వాచ్లు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాచ్లు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాటిని మనం ఎడమ చేతికి మాత్రమే ధరిస్తూ ఉంటాం.. మరి వాచ్ లు ఎడమ చేతికి ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Also Read: దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
వందలో 90 శాతం వాచ్ ను ఎడమ చేతికి మాత్రమే పెట్టుకుంటారు. ఇందులో కొంతమంది కుడి చేతికి పెట్టుకుంటారు.. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా. వాచ్ ఎడమ చేతికి ఎందుకు పెట్టుకోవాలి కుడి చేతికి పెట్టుకోవచ్చు కదా అని.. వచ్చే ఉంటుంది లేండి.. ఎందుకు పెట్టుకుంటారో పూర్తి వివరాలు చూద్దాం.. వాచ్లను తయారు చేయడం ప్రారంభించినప్పుడు ముందుగా పాకెట్ వాచ్ లు ఉండేవి. జనాలు వాటిని తమ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు.
Advertisement
కావలసినప్పుడు బయటకు తీసి టైం చూసి మళ్లీ జేబులో పెట్టుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలకు చేతికి పెట్టుకోవడం ప్రారంభించారు. అది కూడా ఎడమ చేతికి ఎక్కువగా వాచ్ లను పెట్టుకునేవారు. దీనికి ప్రధాన కారణం చాలామంది కుడిచేత్తో పనిచేస్తారు కాబట్టి మాటిమాటికి చేతిని పైకి లేపి టైం చూడడం ఇబ్బంది అవుతుందని, ఎడమ చేతులకు వాచీలు పెట్టుకునేవారు. అలా ఇప్పటికీ ఎడమ చేతికే వాచ్ పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
Also Read:కేటీఆర్ పై కిషన్ రెడ్డి.. మోడీపై కేటీఆర్.. పంచ్ ల ప్రవాహం..!