Advertisement
ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరని అడిగితే ఆలోచించకుండా చెప్పే పేరు రాజమౌళి. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన దర్శకుడు. ఆయన విజన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హీరోలే రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి ఎన్ని హిట్ సినిమాలు తెరకెక్కించినా ఆ సినిమాల విజయంలో ఆయన ఫ్యామిలీ కష్టం కూడా ఎంతో ఉంటుంది. రాజమౌళి సినిమాల కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంతో ఎఫెక్ట్ పెట్టి మరి కథలు రాస్తాడు. ఇక రాజమౌళి భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది.
Advertisement
Read also: APOLLO FISH IN TELUGU: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
Advertisement
కీరవాణి ఎలాగో సంగీతం అందిస్తారు. ఇక ఆయన ఫ్యామిలీలో మిగిలిన వారు కూడా ఆయన సినిమాలకు ఏదో ఒక రూపంలో పనిచేస్తూనే ఉంటారు. రాజమౌళిది ప్రేమ వివాహం అని, తన అన్న కీరవాణి భార్య వల్లి అక్క అయినా రమ ని రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నాడని అందరికీ తెలుసు. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ది కూడా ప్రేమ వివాహమే అట. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఆయనే బయటపెట్టారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఆయన భార్య గురించి, ఆమెకి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.
ఆయన కమ్మ వర్గానికి చెందినవారు. అతని భార్య నందిని కాపు వర్గానికి చెందిన మహిళ. అయితే ఈ విషయం ఆయనకి పెళ్లి అయిన చాలా రోజుల వరకు తెలియదట. 1966 లో వారి వివాహం జరిగిందని, అయితే తన భార్యది ఏ కులమో కూడా తెలియదని చెప్పారు. ఖైదీ సినిమా విడుదల అయినప్పుడు సినిమాకు వెళ్లగా చిరంజీవి మావాళ్లే.. మా బంధువే అంటూ తన భార్య చెప్పిందని అన్నారు. అంతేకాకుండా తమ కుటుంబంలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నారని ఓ సందర్భంలో రాజమౌళి తెలిపారు. తమ కుటుంబంలో అమ్మాయిలు.. కాపు, పద్మశాలి, ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్నారని.. కులాల పట్టింపులు లేవని అన్నారు.
Read also: ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?