Advertisement
ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడో తరం వారసుల హవా నడుస్తుంది. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీని రంగ ప్రవేశం చేయిస్తారు. కానీ ఇందుకు శోభన్ బాబు వ్యతిరేకం. టాలీవుడ్ మొదట్లో టాప్ హీరోలుగా ఉన్న వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ శోభన్ బాబు పేరే చెబుతారు. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇంత స్టార్ డం ఉన్నా కూడా మిగతా హీరోల మాదిరి తన కొడుకును మాత్రం ఆయన సినిమాలకు పరిచయం చేయలేదు.
Advertisement
Read also: పాలిటిక్స్ కోసమే మౌనిక రెడ్డితో వివాహమా ? అనే కామెంట్స్ కి మంచు మనోజ్ ఇచ్చిన ఆన్సర్ అదుర్స్ !
Advertisement
ఎప్పుడూ ఇండస్ట్రీకి దూరంగానే ఉంచారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకువచ్చారు కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం చేయలేదు. కనీసం తన ఫ్యామిలీ గురించి ఎటువంటి విషయాలను ఇతరులతో పంచుకోలేదు. ఆ కాలంలో రాజా రవీంద్ర.. శోభన్ బాబును ఇదే ప్రశ్న అడిగారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు. రాజా రవీంద్ర అడిగిన ప్రశ్నకు శోభన్ బాబు ఏమని సమాధానం చెప్పారంటే..? ” నేను సినిమాలలోకి వచ్చిన కొత్తలో ఎంతగానో కష్టపడ్డాను. ఎన్నో అవమానాలు పడ్డాను.
సక్సెస్ అయినప్పటికీ చాలా ఒత్తిడికి గురైయ్యేవాడిని. నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో వారికి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా నేను వ్యతిరేకించాను” అంటూ శోభన్ బాబు రాజా రవీంద్ర తో చెప్పుకోచ్చారట. ఉదయం కాలేజీకి వెళుతూ మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ తిరుగుతూ శోభన్ బాబు సినిమాలలో సక్సెస్ కావడం కోసం ఎంతో కష్టపడ్డారని, శోభన్ బాబుకి ఎక్కడ మొదలుపెడితే అక్కడే ఆపేయడం అలవాటని.. అందుకే ఆయన హీరో గానే కెరీర్ ను ఆపేశారని ఈ సందర్భంగా రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read also: బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి ఎన్నికోట్లకు అధిపతో తెలుసా..?