Advertisement
టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద తన నటనతో చాలా సినిమాల్లో హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు సాధించింది నటి లయ. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. తాజాగా ఆమె తన ఆస్తుల గురించి మాట్లాడిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.. అప్పట్లో వేణుతో స్వయంవరం చిత్రంలో నటించానని, ఆ తర్వాత కల్యాణ రాముడు మూవీలో వేణుతో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ చిత్రానికి బల్క్ డేట్స్ అడగడం వల్ల నో చెప్పానని లయ తెలిపారు.
Advertisement
also read: Apollo Fish in Telugu: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
షిఫ్ట్ చేసి డేట్స్ కావాలని అడిగి ఉంటే మాత్రం ఆ మూవీలో నేను నటించి ఉండే దానినేమో అని లయ అన్నారు. ఇక నువ్వు లేక నేను లేను మూవీలోని నా పాత్ర కావాలని ఆబ్లికేషన్ తో చేసిన రోల్ అయితే కాదని, లయ కామెంట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ తో ఉన్న అనుబంధం వల్ల ఆ మూవీలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికే ఆ బ్యానర్లో సినిమాలు చేయడం వల్ల నో అని చెప్పలేకపోయానని లయ తెలియజేశారు. అంతేకాకుండా హనుమాన్ జంక్షన్ సినిమాలో చివరి నిమిషంలో యాడ్ ఆమె చెప్పుకోచ్చారు.
Advertisement
also read: “అమ్మా ఇంకోసారి ఏడిస్తే మాత్రం గుడ్ బై చెబుతాను”.. అంటూ తారకరత్న కూతురు ఎమోషనల్ పోస్ట్..!!
జగపతిబాబు గారి వల్ల ఆ చిత్రంలో ఛాన్స్ దక్కిందని, నేను అవకాశాలు అడిగి ఇబ్బంది పెడతానేమో అని అనిపిస్తుందని, అందుకే అడగనని ఆమె కామెంట్ చేశారు. అంతేకాకుండా నేను అంబానీ సిస్టర్ ను అంటూ చెప్పుకొచ్చారు. టాటా మనవరాలిన అని వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని, సొంత ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చానని లయ చెప్పుకొచ్చారు. ఫ్లైట్ లో నుంచి నా ఆస్తులు చూపిస్తున్నానని ఆమె సరదాగా అన్నారు. నిజమైన ఆస్తుల గురించి స్పందిస్తూ మా కుటుంబానికి బాగానే ఆస్తులు ఉన్నాయని, అయితే వేల కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం లేవని హీరోయిన్ లయ అసలు విషయాన్నీ బయట పెట్టారు.
also read: