Advertisement
తెలుగు ఇండస్ట్రీలోనే తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్. ఏ పాత్రలో అయినా ఇట్టే దూలిపోయే కళాశక్తి ఆయన సొంతం. ఆయన పౌరాణిక సినిమాలు చేశాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది. రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది. అయితే ఈ ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు మహిళలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు లెజెండ్స్ యొక్క భార్యలు. చెన్నైలో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి దిగిన ఫోటో ఇది.
Advertisement
READ ALSO : రాజమౌళి అమ్మగారు చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?
అక్కినేని అన్నపూర్ణ:
1933 లో పుట్టిన అన్నపూర్ణ, 1949 ఫిబ్రవరి 18న అక్కినేని నాగేశ్వరరావు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కుమారుల్లో నాగార్జున సినిమా హీరో కాగా, వెంకట్ సినీ నిర్మాత
Advertisement
బసవతారకం:
1942లో ఎన్టీఆర్, బసవతారకంల వివాహం జరిగింది. వీరికి 12 మంది సంతానం. 8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
READ ALSO : ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?
వీరమాచినేని వసుంధర దేవి:
వీరమాచినేని వసుంధర దేవి, ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ భార్య, జగపతిబాబు వీరి కుమారుడె, వీరికి జగపతిబాబుతో కలిసి మరో ఇద్దరు పిల్లలు.
READ ALSO : APOLLO FISH IN TELUGU: అపోలో ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?