Advertisement
ప్రస్తుతం ఎక్కడ చూసినా నాటు నాటు పాటకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత దేశంలో చాలా నెలలపాటు ఈ పాట మార్మోగిపోయింది. ఈ పాటకి ఎంతో ఆదరణ లభించింది.అంతర్జాతీయంగా కూడా అత్యున్నత అవార్డు అయినా ఆస్కార్ అవార్డు రావడంతో ఇండియన్స్ అంతా ఆనందపడ్డారు. అలాంటి ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ హక్కులను ఇందిరా లహరి మ్యూజిక్ యాజమాన్యం నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Advertisement
also read: మనల్ని ఎవడ్రా ఆపేది.. విజయవాడ టు మచిలీపట్నం.. ఇసుకేస్తే రాలనంతగా..!
కీరవాణి బాణీల్లో రాజమౌళి టేకింగ్ ఈ పాటకు మరింత అద్భుతంగా వచ్చేలా చివరికి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేశాయి. నాటు నాటు పాట అకాడమీ అవార్డును తెలుసుకోవడంతో లహరి మ్యూజిక్ వ్యవస్థాపకుడు సిఎండి మనోహరన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ యూనిట్ కి మొత్తం విషెస్ చెప్పారు. కీరవాణితో సహా చిత్ర యూనిట్ మొత్తం అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అయితే ఈ నాటు నాటు పాటకు ఆస్కార్ తో సహా ఎన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.. ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్ 9 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది..
Advertisement
also read: పేర్ని ఇలాకాలో పవన్.. యథావిధిగా ముందే తిట్ల వర్షం..!
1. అకాడమీ అవార్డు- ఉత్తమ ఒరిజినల్ పాట
2. గోల్డెన్ గ్లోబ్ అవార్డు – బెస్ట్ ఒరిజినల్ సాంగ్
3. క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డు – ఉత్తమ పాట
4. హ్యూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్.
5. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్.
6. లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ – ఉత్తమ సంగీతం
7. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ – ఉత్తమ ఒరిజినల్ స్కోర్.
8. పండోర ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ – బెస్ట్ సాంగ్ కంపోజింగ్.
9. ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ – ఉత్తమ ఒరిజినల్ సాంగ్. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో 9 అవార్డులు తెచ్చుకొని చరిత్ర క్రియేట్ చేసింది .
also read:మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?