Advertisement
Nadiya Daughters: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన “అత్తారింటికి దారేది” సినిమాలో అత్త పాత్రలో తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రముఖ సీనియర్ నటి నదియా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో పవన్ కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నంది పురస్కారం లభించింది. అంతకుముందు మిర్చి సినిమాలో ప్రభాస్ అమ్మ క్యారెక్టర్ లోను నటించి మెప్పించింది నదియా. ఆ తరువాత దృశ్యం, అ ఆ, బ్రూస్ లీ, సర్కారు వారి పాట ఇలా తదితర సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయింది.
Advertisement
Read also: అబ్బాయిలు ఇది మీకే ! అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలో ఈ అలవాట్లు కచ్చితంగా ఉండాలి..!!
Advertisement
వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. మలయాళం లో మోహన్ లాల్ సరసన నటించిన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. తమిళం, మలయాళం లో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బోలె అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయింది. ఈ దంపతులకు 1996లో సనం అనే కుమార్తె పుట్టింది. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే.. 2001లో రెండవ అమ్మాయి జానా వీరి జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చేసిన నదియా తన కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడింది.
Also Read: Telugu News, Tollywood Telugu cinema News
నదియా సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అప్పుడప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఆ మధ్యన తన కూతుర్ల ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు నదియా. అయితే ఈ ఫోటోలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అందంలో అమ్మకు ఏమాత్రం తీసిపోని అక్క చెల్లెలు, అందులోను ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూసి అక్క చెల్లెలు గా ఉన్నారని కామెంట్లు చేశారు. ఒకవేళ అమ్మలాగే వీరు కూడా సినిమా రంగం వైపు వస్తారో.. అమ్మలా హిట్స్ అందుకుంటారో? లేదో? చూడాలి.
Read also: క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటో తెలుసా..?