Advertisement
తెలుగు పాట చరిత్ర సృష్టించింది. అందరూ ఎదురు చూసిన కళ నెరవేరింది. యావత్ దేశం సంతోషంతో పులకరించి పోయింది. 130 కోట్ల మంది గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన “నాటు నాటు” పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డుని ప్రకటించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటుకి ఈ అవార్డు రావడం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. 8 దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. ది అవార్డు గోస్ టు ” నాటు నాటు” అని చెప్పగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఒక ఆస్కార్ రాగా.. అత్యధిక ఆస్కార్లను గెలుచుకున్న 09 సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also: 12 ఇయర్స్, కపుల్ చాలెంజ్! అలా మొదలైంది మా ప్రేమ కథ!
1. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ (2003) – 11 ఆస్కార్లు
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు ఉత్తమ రచన, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్-సెట్, డెకరేషన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్, బెస్ట్ మ్యూజిక్, ఒరిజినల్ స్కోర్, బెస్ట్ మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లకు ఆస్కార్ వచ్చింది.
2. టైటానిక్ (1997) – 11 ఆస్కార్లు
Advertisement
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కళా దర్శకత్వం-సెట్ డెకరేషన్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ స్కోర్, ఉత్తమ పాట బెస్ట్ సౌండ్, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ లకు ఆస్కార్ వచ్చింది.
3. బెన్-హర్ (1959) – 11 ఆస్కార్లు
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, రంగు, ఉత్తమ కళా దర్శకత్వం-సెట్ డెకరేషన్, రంగు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, కలర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ బెస్ట్ స్కోర్, బెస్ట్ సౌండ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లకు ఆస్కార్ వచ్చింది.
4. వెస్ట్ సైడ్ స్టోరీ (1961) – 10 ఆస్కార్లు
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, రంగు ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్-సెట్ డెకరేషన్, కలర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, కలర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ స్కోర్, బెస్ట్ సౌండ్ లకు ఆస్కార్ వచ్చింది.
5. ది ఇంగ్లీష్ పేషెంట్ (1996) – 9 ఆస్కార్లు
6. ది లాస్ట్ ఎంపరర్ (1987) – 9 ఆస్కార్లు
7. జిగి (1958) – 9 ఆస్కార్లు
8. స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008) – 8 ఆస్కార్లు
9. అమేడియస్ (1984) – 8 ఆస్కార్లు
Read also: ‘కాంతారా’ సినిమాకి ‘విరూపాక్ష’ సినిమాకి ఉన్న ఉన్న లింక్ ఏంటో తెలుసా?