Advertisement
మన హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రం ఎలాగో వాస్తు శాస్త్రాన్ని కూడా ఆ విధంగానే నమ్ముతాం. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో అష్ట దిక్కులు పంచభూతాలు నవ గ్రహాలకి ఎక్కువ ప్రాధాన్యత మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక్కో గ్రహానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. అందుకే ఎవరైనా ఇల్లు లేదా కార్యాలయం ఇతర నిర్మాణాలు ఏవైనా చేస్తే గ్రహాలతో పాటు దిక్కులను కూడా పరిగణలోకి తీసుకోవడం మనం చూసాం. ఈ నియమాలను పాటించి నిర్మాణాలు చేపట్టి ఎప్పుడైనా సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి దీన్ని బట్టి ఏ గ్రహం ఏ దిక్కుకు అధిపతిగా ఉంటుందో, వాస్తు దోషాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read: Kabza Movie Review in Telugu: ఉపేంద్ర “కబ్జా” మూవీ రివ్యూ & రేటింగ్
సూర్యుడు :శాస్త్రం ప్రకారం సూర్యుడు తూర్పు దిక్కున అధిపతిగా ఉంటాడు. అందుకే మనం తూర్పు తిరిగి దండం పెడతాం. సూర్యుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆదాయాన్ని కలిగిస్తాడు. కాబట్టి తూర్పు దిశలో బరువు ఉండే వస్తువులు పెట్టరాదు.
Advertisement
చంద్రుడు: చంద్రుడు వాయువ్య దిశకు అధిపతిగా ఉంటాడు. చంద్రుడిది ప్రశాంతమైన మనసు సంపదకు కారకుడిగా ఉంటాడు . కాబట్టి ఈ దిక్కులో భోజనశాల లేడీస్ రూమ్ ఉండడం మంచిది.
also read:ఆస్కార్ అవార్డు ని నిజంగా అమ్ముకోవచ్చా ?? ఆలా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
కుజుడు:కుజుడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు.ఈ దిక్కులో యముడు కూడా ఉంటాడు. అంగారకుడు ధైర్యం కోపం సంపదలకు అధిపతి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిక్కులో బెడ్ రూమ్ స్టోర్ రూమ్ ఉండడం మంచిది.
బుధుడు:వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు బుధుడు అధిపతి. కాబట్టి ఈ దిక్కులో విలువైన వస్తువులను ఉంచడం మంచిది.దీనివల్ల సంపద కూడా అధికంగా వస్తుందట.
శని దేవుడు:వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిశలో శని దేవుడు అధిపతి. వరుణుడు కూడా ఇదే దిశకు అధిపతి. అందుకే ఈ దిక్కు లాభాలను సూచిస్తుంది. ఇక శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు.
also read:ఎండాకాలంలో మిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. సింపుల్ టిప్స్..!!