Advertisement
TSPSC PAPER LEAK ISSUE Renuka: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ. లక్షలు కాల్ చేసేందుకు వ్యూహరచన చేసినట్లు సిట్ దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ పేపర్ లో లీకేజీ వ్యవహారానికి అసలు సూత్రధారి, నిందితులలో ఒకరైన రేణుకనే అని సమాచారం. ప్రస్తుతం ఆమె గురించి అనేక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును బేగం బజార్ ఠాణా నుంచి సీసీఎస్ కు బుధవారం బదిలీ చేశారు. సిట్ అధిపతి ఏఆర్ శ్రీనివాస్ దర్యాప్తును వేగవంతం చేశారు. తమ్ముడి పేరుతో ప్రశ్నాపత్రాలు సంపాదించేందుకు వనపర్తి జిల్లా గురుకుల పాఠశాల ఉపాధ్యాయిని రేణుక రాథోడ్ పెద్ద తతంగమే నడిపినట్లు గుర్తించారు.
Advertisement
Read also: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేణుక 2011 సమయంలో ఓపెన్ లో టెన్త్ రాసి.. ఆ తరువాత ఇతర కోర్సులు చేసిందట. 2018లో హిందీ పండిట్ గా ఉద్యోగం పొంది.. వనపర్తి జిల్లా బుద్ధారం లోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. రేణుక తల్లి లక్ష్మీబాయి మన్సూర్ పల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కావడంతో కలిసి వచ్చిన రాజకీయ బలం, గురుకుల ఉపాధ్యాయురాలిగా తనకు, టెక్నికల్ అసిస్టెంట్ గా తన భర్త డాక్యా నాయక్ కు ఉన్నత స్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆమె లీకేజీ కి పూనుకున్నట్లు చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో రేణుకకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చేది. తన వన్ టైం పాస్వర్డ్ కి సంబంధించిన విషయంలో మాట్లాడుతూ.. అక్కడే పని చేస్తున్న ప్రవీణ్ తో పరిచయం పెంచుకుంది. 2017 నుంచి విధుల్లో ఉన్న ప్రవీణ్ టీఎస్పీఎస్ అధికారుల వద్ద మంచి వ్యక్తిగా మెలిగేవాడు.
Advertisement
అయితే అతడికి అమ్మాయిల బలహీనత ఉందని కొందరి వాదన. ఇక రేణుకకు రాజేశ్వర్ అనే సోదరుడు ఉన్నాడు. టిటిసి చేసిన అతడికి ఏఈ ఉద్యోగం ఇప్పించాలని భావించిన రేణుక.. తమ్ముడి కోసం ప్రశ్నాపత్రాలు సంపాదించేందుకు రేణుక ముందుగా ప్రవీణ్ ను కలిసి తన సోదరునికి ప్రశ్నాపత్రాలు కావాలని కోరింది. తమ్ముడి కోసం ఆమె సంపాదించిన పత్రాలతో ఇతర అభ్యర్థుల నుంచి లక్షలు కాజేసేందుకు పక్కా వ్యూహం రచించినట్లు దర్యాప్తుతో బయటపడింది. ఈ వ్యూహంలో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొందరు యువకులకు ప్రశ్నాపత్రాలు సమకూరుస్తానంటూ 14 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే రోజు వరకు రేణుక మొత్తం 16 రోజులు సెలవు పెట్టినట్లు తెలిసింది.జనవరిలో 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరి 1, 4 నుంచి 8 వరకు, 24న సెలవు పెట్టింది. ఈనెల 4,5 తేదీల్లోనూ ( ఏఈ పరీక్ష జరిగిన రోజులు ) సెలవు తీసుకుంది. తన బాబుకు బాగాలేదని, సెలవు కావాలని ప్రిన్సిపాల్ కు 4న అర్ధరాత్రి ఒంటిగంటకు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. అలాగే మార్చ్ 5వ తేదీన సిఓఈ ప్రవేశ పరీక్షకు ఇన్విజిలేటర్ గా విధులు నిర్వర్తించేందుకు రావాలని కోరినా రాలేదని తెలిసింది.
Read also: నవీన్ కేసులో గర్ల్ ఫ్రెండ్ నిహారిక చెప్పిన సంచలన విషయాలు కొత్తగా వెలుగులోకి…!
తమ మరిది చనిపోయారని, మూడు రోజుల సెలవులు కావాలని 10న వాట్సాప్ ద్వారా కోరింది. దీంతో ప్రిన్సిపల్ 10, 11, 12 తేదీలను సెలవుగా మార్క్ చేశారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో సెలవులో ఉన్నారని గురుకుల పాఠశాల సిబ్బంది భావించారు. అయితే అదే రోజు సాయంత్రం టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన బయటపడింది. ఇంకా దారుణం ఏమిటంటే త్వరలో జరగనున్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల రాత పరీక్షకు కూడా రేణుక ముందుగానే సెలవులు పెట్టడం గమనార్హం. దీంతో రేణుకను సస్పెండ్ చేయనున్నట్లు గురుకుల సొసైటీ వర్గాలు వెల్లడించారు. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రవీణ్ ఫోన్ లో వంద మందికి పైగా మహిళల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 42 మంది మహిళల అర్థనగ్న, నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ బలహీనతను అవకాశం గా తీసుకొని రేణుక ఈ పేపర్ ల లీకేజీ వ్యవహారం నడిపిందని టాక్. కానీ చివరకు బేరసారాలు బెడిసికొట్టడంతో ప్రవీణ్, రేణుక, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ అడ్డంగా దొరికిపోయారు.
Read also: Latest Telugu News