Advertisement
కేజిఎఫ్ సినిమాలోని హీరో పాత్ర, తల్లి పాత్ర గురించి పేరు ఎత్తకుండా దర్శకుడు వెంకటేష్ మహా అవమానకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే తగిన మూల్యం చెల్లించారు. వెంకటేష్ మహాను, ఆయన సినిమాలను అభిమానించే ప్రేక్షకులు ఉన్నట్లే.. కేజిఎఫ్ ను కమర్షియల్ సినిమాను అభిమానించే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆయన పై తీవ్రంగా స్పందించారు. కేజిఎఫ్ అభిమానులు మాత్రమే కాకుండా కమర్షియల్ సినిమాను, ఆ తరహా సినిమాలను రూపొందించే మేకర్స్ ను అవమానించారంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
Advertisement
Read also: KONIDELA NIHARIKA – CHAITANYA: మెగా ఫాన్స్ కి బిగ్ షాక్ ! నిహారిక – చైతన్యలు విడిపోతున్నారా ??
ఇక తన వ్యాఖ్యలను ఒక వైపు సమర్ధించుకుంటూనే మరోవైపు తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలి అంటూ బహిరంగ క్షమాపణ చెప్పాడు. అయితే అలా కేజిఎఫ్ సినిమాలోని లాజిక్ ను వెంకటేష్ మహా వెతికినట్లే మీమర్స్ మిగతా తెలుగు సినిమాలలోని లాజిక్ లు వెతుకుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు సినిమాపై అలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, త్రిష కథానాయికగా నటించారు. ఈ చిత్రం మూడు నంది పురస్కారాలు, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది.
Advertisement
అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు ట్రైన్ లో వెళుతుండగా చాలా ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసేందుకు వెళుతున్న పార్ధు బుల్లెట్ తగిలి చనిపోతాడు. కానీ ఆ బుల్లెట్ ను కాల్చింది మహేష్ బాబు కోసం. ఇక పార్ధు చెప్పిన వివరాలతో అతని ఇంటికి వెళ్లిన తరువాత వాళ్లంతా మహేష్ బాబుని పార్ధు అని అనుకోవడంతో సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత పార్ధులానే జీవిస్తాడు. కానీ చివరికి నిజం తెలిసిన తర్వాత అబద్ధం మాత్రమే చెప్పానని.. మోసం చేయలేదని అంటాడు. కాగా పార్ధు చనిపోయింది నీవల్లే, మోసం చేశావు నువ్వు..? పూరి వాళ్ళ అక్కకు వైయస్సార్ కానుకలా డబ్బులు ఇచ్చి పూరీని వలలో వేసుకున్నావు… నువ్వే పార్ధు అని చెప్పి మోసం చేశావు అంటూ లాజిక్ వెతికి మరి ట్రోల్ చేస్తున్నారు మీమర్స్.