Advertisement
కోహ్లీ బ్యాటింగ్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది తక్కువ కాలంలో ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి చేరిన తీరే అతనేంటో చెబుతుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టుల్లోను అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారీ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సైతం కోహ్లీనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోహ్లీ ఫామ్ లో ఉన్నా లేకున్నా ప్రత్యర్థి జట్టుకు మాత్రం అతను అంటే భయం ఉంటుంది. ఆస్ట్రేలియా కైతే ఆ భయం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో తెలియదు, కోహ్లీ వికెట్ దక్కితే మ్యాచ్ గెలిచేసినంత సంతోషపడుతుంటారు కంగారులు.
Advertisement
READ ALSO : Tollywood Telugu Movies: పాత సినిమా టైటిల్స్ తో ఇప్పటి దాకా వచ్చిన వచ్చిన 10 టాలీవుడ్ మూవీస్ !
కోహ్లీ వికెట్ కోసం దక్కించుకునేందుకు ఏ చిన్న అవకాశం వచ్చిన వదులుకోరు. ఎక్కడ చిన్న తప్పు చేసి దొరికిపోతాడా అని వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే కోహ్లీ ఒక్కడు నిలబడితే తమ నుంచి మ్యాచ్ లాగేసుకుంటాడని వాళ్లకు బాగా తెలుసు. అందుకే కోహ్లీ అంటే ఆస్ట్రేలియాకు అంతభయం. మూడో వన్డే సందర్భంగా మరోసారి స్పష్టంగా బయటపడింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 17 మంత్రుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 30 పరుగులు చేసి బాగా ఆడుతూ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
Advertisement
READ ALSO : Venus wamy Wife Name: వేణు స్వామి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?
రోహిత్ శర్మ అవుట్ తర్వాత క్రిజ్ లోకి వచ్చిన కోహ్లీ ఆరంభంలో బాల్ టూ బాల్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో కోహ్లీని ఒత్తిడిలోకి నెట్టేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నించింది. బాల్ బ్యాట్ కు తాకలేదని స్పష్టంగా తెలుస్తున్న అప్పిల్ చేసింది. దానికి అంపైర్ అడ్డంగా తల ఊపినా కూడా రివ్యూ కొరుకున్నారు. రీప్లేలో బాల్ కు బ్యాట్ కు చాలా గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అది చూసిన తర్వాత దీనికి కూడా ఎవడైనా రివ్యూ తీసుకుంటారా? అని క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. కోహ్లీ మీద భయంతోనే ఆస్ట్రేలియా ఇలా చేస్తుందంటూ పేర్కొంటున్నారు.
READ ALSO : ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?