Advertisement
పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడకానికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ పై జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ భూమిలో కరగడానికి చాలా కాలం పడుతుంది. దీంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకంతో పాటు, వాటిని ఉత్పత్తి చేయడం, నిల్వ, పంపిణీ, అమ్మకం, పైన నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Advertisement
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల నిషేధం కోసం జాతీయంగా, రాష్ట్రాల స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ వెల్లడించింది. అక్రమంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతి, నిల్వ చేయడం, పంపిణీ, అమ్మకాలతో పాటు వాడకంపై తనిఖీలు చేపట్టడం కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం లను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
Advertisement
సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే?
నిజానికి ఇదేం బ్రహ్మ పదార్థం కాదు, అర్థం కాని విషయము కాదు. యూరోపియన్ యూనియన్ నిర్వహించిన ప్రమాణాల ప్రకారం చెప్పాలంటే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్స్ సంచులను సింగిల్ యూస్ ప్లాస్టిక్ గా చెప్పవచ్చు.
నిషేధిత జాబితాలో ఉన్నవి.
Also Read: ‘అంటే సుందరానికి’ మూవీలో హీరో బామ్మగా నటించిన నటి ఎవరంటే..
నిషేధిత జాబితాలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది, అందులో కొన్ని.
* ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్పులు, స్ట్రాలు, ఫోర్కులు
* స్వీట్ బాక్సులు, ఫుడ్ ప్యాకింగ్ లో వాడే ప్లాస్టిక్ కవర్లు
* ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్ బర్డ్స్
* బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్
* ప్లాస్టిక్ జెండాలు
* లాలీపాప్, చాక్లెట్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్
* ఐస్ క్రీమ్ పుల్లలు
* థర్మోకోల్
* వంద మైక్రాన్ల లోపు మందం గల పివిసి బ్యానర్లు
* ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు
Also Read: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్ .!