Advertisement
ప్రజలు తమ ఇళ్ళను వారికి దొరికే సమయాన్ని బట్టి అలవాట్లను, అభిరుచులను బట్టి శుభ్రపరుచుకుంటూ ఉంటారు. కొందరు ఇళ్లను రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటే, కొందరు వారానికి ఒకసారి ఈ పని పెట్టుకుంటారు. రోజు చేసే క్లీనింగ్ తో పాటు కొందరు ఇంటి మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటారు. కొందరు ఏడాదికి ఒకసారి ఇంటిని అద్దంల తీర్చిదిద్దుకుంటారు. డీప్ క్లీనింగ్ పేరుతో ఆరోజు ఇంటిని పూర్తిగా సర్దుకుని శుభ్రపరచుకుంటారు.
Advertisement
READ ALSO : ఆస్కార్ అవార్డు 80 కోట్లకి కొన్నారు అనే కామెంట్ కి దానయ్య దిమ్మ తిరిగే రిప్లై ! ఏమన్నారంటే ?
చాలామంది కిచెన్ ను, బాత్రూం ను తరచూ క్లీన్ చేస్తుంటారు. అయితే డిష్ స్పాంజ్ ను మనం క్లీన్ చేసే వస్తువుగానే చూస్తాం. డిష్ వాషర్ సోప్ గా మనం పరిగణిస్తాం. సోప్ తో దీన్ని వాడుతూ ఉండడం వల్ల ప్రత్యేకంగా దీన్ని శుభ్రపరచుకోవాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. జర్మనీలోని ఒక యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో సింకుపై కంటే స్పాంజ్ పైన ఎక్కువ క్రీములు, బ్యాక్టీరియాలు ఉన్నట్లు తెలిసింది.
Advertisement
READ ALSO : టాలీవుడ్ లో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ సాధించిన హీరోలు ఎవరంటే ?
బాత్రూం స్పాంజ్ ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా కిచెన్ స్పాంజ్ లపైనే ఉంటాయి. ఈ స్పాంజ్ ల పైన 362 రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు ఒక అధ్యయనం గుర్తించింది. దీనికి గల ప్రధాన కారణం ఈ స్పాంజ్ నిత్యం తడిగా ఉండటమే. ఈ స్పాంజ్ లో చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. క్రీములు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందేందుకు ఈ రంధ్రాలు దోహదం చేస్తాయి. ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియాలను నిర్మూలించేందుకు వారంలో ఒకసారైనా క్లోరిన్, బ్లీచ్ తో ఈ స్పాంజ్ లను శుభ్రపరచుకుంటూ ఉండాలి.
READ ALSO : Das Ka Damki Movie Review in Telugu: విశ్వక్ సేన్ ” దాస్ కా దమ్కీ” రివ్యూ & రేటింగ్