Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వీరు సినిమాలో నటిస్తున్నారు అంటే తప్పనిసరిగా సినిమా చూసేవారికి పోట్ట చెక్కలయ్యేది.. అంటే థియేటర్ అంతా నవ్వులతో నిండిపోయేది. అలాంటి స్టార్ కమెడియన్లు ఒక్కొక్కరు వందలాది సినిమాలు తీసి నవ్వుల రారాజులుగా మారారు. ఇక నవ్వులే వారి జీవితంలో సర్వస్వం అనుకున్న తరుణంలో ఈ నవ్వులు వదిలేసి బాధలు, కోపాలు, ఏడుపులు, కన్నీళ్లు ఇక రకరకాల పాత్రలు చేస్తూ మేం దేనిలో తక్కువ కాదంటూ వారి టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.. నవ్వును వదిలి వివిధ పాత్రల్లో మెప్పిస్తున్న ఆ కమెడియన్స్ ఎవరో మనం కూడా ఓ లుక్ వేద్దాం..
Advertisement
నవ్వులకు బేకిచ్చిన బ్రహ్మీ:
దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వచ్చారు కమెడియన్ బ్రహ్మానందం. సోషల్ మీడియాలో ఈయన ఫోటోతో ఎంతోమంది ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి హాస్యబ్రహ్మ రంగ మార్తాండ సినిమాలో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని చూపించారు. అంతేకాదు కొంతమంది ప్రేక్షకులను ఏడిపించారు బ్రహ్మానందం.
also read: దేవిశ్రీని పెళ్లి చేసుకునే అమ్మాయి వయసులో 17 ఏళ్లు చిన్నదా..?
వణికించిన సునీల్:
తన కామెడీతో ఎంతోమంది ముఖాలపై నవ్వులు తెప్పించిన స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా కూడా అనేక సినిమాలు చేశారు. ఓవైపు యాక్టింగ్ మరోవైపు డాన్స్, కామెడీ ఇప్పటివరకు చూసాం. కానీ మొదటిసారిగా పుష్ప సినిమాలో విలన్ పాత్ర చేసి అందరిని భయపెట్టారు.
Advertisement
బలగం వేణు:
జబర్దస్త్ కామెడీ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు, పలు సినిమాల్లో కూడా నటించారు. ఇక కామెడీ తప్ప ఏది తెలియదనుకున్న తరుణంలో బలగం సినిమాతో దర్శకుడిగా మారి చరిత్ర క్రియేట్ చేశారు.
also read: రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?
కన్నీరు పెట్టించిన కోవై సరళ :
ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ అంటేనే సరళ అందరికీ గుర్తుకొస్తుంది. ఇక సరళ, బ్రహ్మానందం కాంబోలో వచ్చిన కామెడీ మామూలుగా ఉండదు. అలాంటి కోవై సరళ ఇటీవల తమిళ “సెంబి” అనే చిత్రం ద్వారా తనలోని మరో కోణాన్ని చూపించింది. ఇందులో కోవై సరళ యాక్టింగ్ చూస్తే కన్నీరు పెట్టాల్సిందే.
ప్రియదర్శి :
ఇక తెలంగాణ యాసలో తన కామెడీతో అందరిని నవ్వించిన ప్రియదర్శి. అప్పుడప్పుడు విభిన్నమైన పాత్రలు చేస్తూ వచ్చారు. మల్లేశం సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించారు. ఇటీవల బలగం సినిమాలో ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఏడిపించారు.
also read:1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?