Advertisement
మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు, ముందుగా ఆ ఫోన్ నెంబర్ పది అంకెలు ఉందా? లేదా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాము కదా! పొరపాటున 9 అంకెలు లేదా 11 అంకెల నంబర్ ని డయల్ చేస్తే, ఫోన్ రింగ్ అవ్వదు. మొబైల్ నెంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉండాలి? మరియు దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? అయితే పదండి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
Advertisement
మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉండడానికి గల ప్రత్యేక కారణం, జాతీయ నంబరింగ్ పథకం, అనగా NNP. 0 నుండి 9 అంకెలలో, ఫోన్ నెంబర్ ఒక డిజిట్ తో మాత్రమే ఉంటే, కేవలం 10 నంబర్లను మాత్రమే తయారు చేయవచ్చు. ఫలితంగా తయారయ్యే 10 ఫోన్ నెంబర్లను 10 మంది మాత్రమే వాడవచ్చు. అదే 0 నుండి 99 అంకెలతో రెండు డిజిట్లతో ఫోన్ నెంబర్ ఉంటే, కేవలం 100 రకాల నంబర్లు మాత్రమే తయారవుతాయి. ఫలితంగా 100 మాత్రమే ఫోన్ నెంబర్లు వాడవచ్చు.
Advertisement
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?
ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉండడానికి గల మరో కారణం ఏంటంటే, ప్రస్తుతం మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ఒకవేళ తొమ్మిది అంకెలతో కూడిన బేసి సంఖ్యలను ఫోన్ నెంబర్ గా పెడితే భవిష్యత్తులో ప్రజలందరికీ ఫోన్ నెంబర్లు కేటాయించడం వీలుపడదు. అదేవిధంగా ఫోన్ నెంబర్ 10 అంకెలతో ఉంటే, గణాంకాల ప్రకారం, వెయ్యికోట్ల విభిన్న సంఖ్యలను తయారు చేయవచ్చు. భవిష్యత్తులో ఫోన్ నంబర్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, మొబైల్ నంబర్ ను 10 అంకెలుగా మార్చారు.